ఒమిక్రాన్ ఎంట్రీతో థర్డ్‌వే ప్రారంభమై భారీ స్థాయిలో వెలుగు చూసిన కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టింది.. లక్షలు దాటిన కేసుల సంఖ్య.. ఇప్పుడు వేలలోకి పడిపోయింది.. మరికొన్ని రోజుల్లో అది వందల్లోకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే, కోవిడ్ కట్టడికోసం.. తీసుకోవాల్సిన చర్యలపై గతంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నందున కోవిడ్ రూల్స్‌కు మినహాయింపులు ఇవ్వాలని సూచించింది.. ఈ మేరకు సోషల్ గ్యాదరింగ్స్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, అకడమిక్, రిలీజియస్, నైట్ కర్ఫ్యూలను సడలించాలని రాష్ట్రాలు, యూటీలకు సూచించింది కేంద్రం.
Read Also: Russia-Ukraine conflict: ఇలా స్పందించిన చైనా
కోవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల ఇచ్చిన గైడ్‌లైన్స్ ఆధారంగా స్థానిక పరిస్థితులను బట్టి అమలు చేయాలని కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా సూచించారు. ఆయా రాష్ట్రాలు, యూటీలలో వైరస్ తీవ్రతను పరిగణలోకి తీసుకొని ఫెస్టివల్ గ్యాదరింగ్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్స్, జిమ్స్, స్పాలు, రెస్టారెంట్లు, బార్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు తదితరాలు తెరవడంతో పాటు కమర్షియల్ యాక్టివిటీస్‌పై కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు.. అయితే, ఇదే సమయంలో.. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, హ్యాండ్స్‌ను వాష్ చేసుకోవడం, అన్ని చోట్ల వెంటిలేషన్ బాగా వచ్చేట్లు చూసుకోవడం లాంటివి కొనసాగించాలని.. టెస్టులు, ట్రీట్‌మెంట్, ట్రేసింగ్, వ్యాక్సినేషన్‌ను కొనసాగించాలని సూచించింది కేంద్రం.