CPI Narayana: బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు.. అదో అధికారిక వ్యభిచార గృహం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర ప్రేక్షకులకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్.. ఇప్పటి వరకు గంట మాత్రమే ఉండే ఈ షో.. ఇవాళ్టి (ఫిబ్రవరి 26వ తేదీ) నుంచే ఓటీటీ తొలి సీజన్ మొదలుకాబోతోంది. ఈ మధ్యనే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమో కూడా విడుదలైంది.. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం కాబోతోంది.. అయితే, బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్‌బాస్ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కొత్త మార్గదర్శకాలు
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశాం.. కేసు పెడదామని ప్రయత్నిస్తే తమ పరిధి కాదంటున్నారు.. కోర్టులో కేసులు వేశాం.. ఇప్పుడు సీపీఐ ఆధ్వర్యంలో బిగ్ బాస్ షోకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు నారాయణ… బిగ్ బాస్ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన… లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు.. 200 కెమెరాలు పెట్టాం అంటున్నారు… అంతా ఎడిటింగ్‌తో ఇస్తున్నారన్న ఆయన.. ఏ సందేశం ఇవ్వాలని ఈ షో నిర్వహిస్తున్నారు… ఆ షో ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఓటీటీ బిగ్ బాస్ ఇంటిని చూపించిన షో యాజమాన్యం ఈ షోకు నాగార్జునే హోస్ట్‌గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. అక్కినేని నాగార్జునపై కూడా మండిపడ్డారు నారాయణ.. అన్నమయ్య , రామదాసు లాంటి సినిమా చేసిన నాగార్జున ఇలాంటి షోకు హోస్ట్‌గా చేయడం సిగ్గుచేటన్నారు నారాయణ. కాగా, గతంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు 24 గంటల పాటు ఓటీటీలో బిగ్‌బాస్ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!