వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. వివిధ అంశాలపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక, వైఎస్ వివేకా హత్యపై విచారణ అక్కర్లేదు..! నిందితులు ఎవరో బయటపడ్డారని వ్యాఖ్యానించారు.. వివేకాను చంపిందెవరో అందరికీ తెలిసిపోయిందన్న ఆయన.. ఆ హత్యకు వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలన్నారు… కానీ, ఇప్పుడు సీబీఐపై కూడా ఎదురు దాడి చేస్తున్నారని.. అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడికిపోతోంది అని ప్రశ్నించారు నారాయణ.
Read Also: Russia-Ukraine conflict: పారిపోలేదు.. దేశాన్ని రక్షించుకుంటా.. ఆయుధాలు కావాలి..
మరోవైపు.. అమెరికా ఎన్నో దేశాలపై దాడి చేసింది.. ఇప్పుడు ఉక్రెయిన్‌ను అడ్డు పెట్టుకోవాలని చూసిందని మండిపడ్డారు నారాయణ.. దాని ఫలితమే ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం అని పేర్కొన్న ఆయన.. 2 నెలల నుంచి యుద్ధం జరుగుతుందని తెలిసినా.. భారత ప్రభుత్వం అప్రమత్తం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అప్పుడే ఆలోచించి ఉంటే.. మన భారతీయుల్ని తీసుకుని వచ్చి ఉండొచ్చు అన్నారు.. నిఘా వైఫల్యమే ఇది.. అసలు విదేశాంగ శాఖ పని చేస్తోందా? అంటూ నిలదీశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై గతంలో మాట్లాడిన సయంలో.. అసలు ఆయన హత్యకు సంబంధించి కారణం ఏమిటో వైఎస్ కుటుంబ సభ్యులే తేల్చాలని పేర్కొన్న విషయం తెలిసిందే.. ఇంటి గుట్టు గనుక ఈ కేసుకు సంబంధించి పోలీసు లేదా సీబీఐ దర్యాప్తు బృందాలు ఏమీ తీర్చలేని పరిస్థితి అని, ఏమాత్రం మానవత్వం లేదా నిజాయితీ ఉంటే కుటుంబ సభ్యులు అసలు విషయం బయటపెట్టాలంటూ నారాయణ డిమాండ్ చేసిన సంగతి విదితమే.