ఆందోళన వద్దు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ప్రజలకు ధైర్యాన్ని చెప్పారు మంత్రి హరీష్‌రావు.. ఇవాళ బాలానగర్ ఫిరోజ్ గూడలో బస్తీ దావాఖానను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి చిత్ర పటానికి నివాళులర్పించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఒమిక్రాన్ కొత్త వైరస్ వచ్చిందని ప్రజలు భయపడుతున్నారు.. కానీ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్టు […]
తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ విద్యుత్ నగర్లో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది… భార్య, భర్త ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ లో చంద్రకాంత రావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయనకు గత కొంతకాలంగా భార్యతో తరచూ గొడవలు […]
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి… ఇందులో భాగంగా భవిష్యత్ కార్యాచరణపై సీఎస్ సమీర్ శర్మకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమంలోకి వెళ్తామని హెచ్చరించాయి.. అయితే, ఇవాళ పీఆర్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్‌ను తిరుపతిలోని సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిశారు.. ఈ సందర్భంగా.. పీఆర్సీపై సీఎంకు విజ్ఞప్తి చేశారు.. దీనిపై స్పందించిన […]
ఏపీపై వైపు మరో తుఫాన్ తూసుకొస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం ప్రారంభమైంది.. తీరం వెంబడి క్రమేపీ గాలుల తీవ్రత కూడా పెరుగుతోంది.. సముద్రం అలజడిగా మారిపోయింది.. ఈదురు గాలులు తీవ్రత క్రమంగా పెరగడంతో.. వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, DMHOలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక సూచనలు చేశారు.. తుఫాన్ నేపథ్యంలో […]
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై ఆసక్తికరమైన విషయాలను బటయపెట్టారు ఆ దేశ శాస్త్రవేత్తలు… జట్ స్పీడ్‌తో ఇప్పటికే 30 దేశాలకు విస్తరించింది ఈ మహమ్మారి.. కేసుల సంఖ్య కూడా 400కు చేరువగా వెళ్లాయి.. అయితే, ఈ వేరియంట్‌పై కొంత అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఆందోళనకరమైన అంశాలను వెల్లడించారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందడమే కాదు.. ఇన్ఫెక్షన్లు, రీ-ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువే అని తేల్చారు.. ఇప్పటి వరకు కరోనాలో వెలుగు చూసిన డెల్టా లేదా బీటా స్ట్రెయిన్ […]
భారత్‌లో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… ఈ మధ్య రోజు వారి కేసుల సంఖ్య ఐదు వేల చేరువగా వెళ్లింది.. కానీ, మళ్లీ క్రమంగా పైకి కదులుతూ పోతోంది కోవిడ్ మీటర్… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,216 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్ బాధితులు మృతిచెంచారు.. ఇదే పమయంలో 8612 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో […]
దూసుకొస్తున్న జవాద్ తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది… తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు జవాద్ తుఫాన్ టెన్షన్ పట్టుకుంది.. గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వస్తే నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు అధికారులు… ముందస్తు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. గాలుల వేగం గంటలకు 50 కిలోమీటర్లు దాటితే ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు.. ఇక, సమస్య తలెత్తిన సబ్ స్టేషన్లు, ఫీడర్లు మరమ్మత్తు కోసం ప్రత్యేక […]
కరోనా మహమ్మారి టెన్షన్ నుంచి ప్రపంచదేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడంలేదు పరిస్థితి.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. జెట్ స్పీడ్‌తో ప్రపంచదేశాలను చుట్టేస్తోంది.. గత నెల 24వ తేదీన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడగా… కేవలం తొమ్మిది రోజుల్లోనే 30 దేశాలకు వ్యాప్తి చెందింది.. అందులో భారత్ కూడా ఉండడం మరింత కలవరపెట్టే విషయం.. ఇక, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. సౌతాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు […]
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కటే చర్చ.. అతే కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ ఇప్పటికే 30 దేశాలను చుట్టేసింది.. భారత్‌లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. అంతేకాదు.. వీరిలో ఒకరి నుంచి ఐదుగురికి కరోనా సోకినట్లు కర్ణాటక సర్కార్ ప్రకటించింది.. ఇక, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుండగా… అధికారులకు షాక్ ఇచ్చాడు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిని వ్యక్తి.. ఒమిక్రాన్ వైరస్ సోకినట్లుగా తేలిన ఇద్దరిలో ఒకరు ఎస్కేప్ అయ్యాడట.. […]
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది… దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు.. విజయవాడలోని రమేష్ ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన మృతిచెందినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు.. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.. కంకిపాడు మండలం నెప్పల్లి శ్రీమన్నారాయణ స్వగ్రామం కాగా.. కంచికచర్లలో స్థిరపడ్డారు. క్రియాశీలక రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనకపోయినప్పటికీ ఆయన ఇద్దకు కుమారులు స్వర్గీయ దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావుల ఎన్నికల ప్రచారంలో పలు సందర్భాల్లో […]