భారత్-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది… క్రమంగా ఉక్రెయిన్‌పై పట్టు సాధిస్తోంది రష్యా.. కొన్ని ప్రాంతాల్లో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నట్టు తెలుస్తోంది.. ఇదే, సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దేశాన్ని వదిలివెళ్లిపోయారని.. ఎక్కడో తలదాచుకున్నాడనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.. అయితే, తాజాగా ఓ వీడియో విడుదల చేసిన జెలెన్‌స్కీ… తాను ప్రస్తుతం కీవ్ నగరంలోనే ఉన్నానని స్పష్టం చేశారు.. రష్యా దాడి తర్వాత జెలెన్‌స్కీ బంకర్‌లోకి వెళ్లారు.. తన స్టాఫ్‌తో కలిసి కొన్ని గంటల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేశారు.. అందరం ఇక్కడే ఉన్నాం.. ఇక్కడే పోరాటం చేస్తాం.. దేశాన్ని రక్షించుకుంటామని పేర్కొన్న ఆయన.. తనకు ఆయుధాలు కావాలని ఆ వీడియోలో కోరారు.
Read Also: Russia-Ukraine conflict: రష్యా డిఫెన్స్‌కు షాక్..!
అయితే, రష్యా నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడిని కాపాడేందుకు తాము సహాయం చేస్తామని ముందుకు వచ్చింది అమెరికా.. ఉక్రెయిన్ ప్రభుత్వం తరపున విదేశాల్లోనూ రిప్రజెంట్ చేసేందుకు జెలెన్‌స్కీని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు సిద్ధమని పేర్కొంది.. కీవ్ నుంచి సురక్షితంగా అధ్యక్షుడిని తరలిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు సమాచారం.. జెలెన్‌స్కీ ప్రాణాలకు ప్రమాదంఉన్న నేపథ్యంలో.. ఆయనను తరలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.. కానీ, కీవ్ వీధుల్లో తీసిన ఓ వీడియోను పోస్టు చేసిన ఉక్రెయిన్ అధ్యోఉడు.. తమ సైనికులతో పాటు దేశాన్ని కాపాడుకుంటామని, కీవ్ నగరాన్ని విడిచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.