సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఇప్పటికే అప్రమత్తమైన చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. ముఖ్యంగా విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు.. ఇక, భారత్ కూడా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ముఖ్యంగా 11 హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది.. కొత్త వేరియంట్‌తో అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో […]
పాత సినిమాల నుంచి నేటి సినిమాల వరకు ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి జరగడం.. ప్రియుడు మధ్యలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆపండి అంటూ అరుపులు.. లేదా పెళ్లిపీఠలపై నుంచే తీసుకెళ్లడం.. తాలికట్టే సమయానికి వచ్చి ఆ తంతు పూర్తిచేయడం.. ఇలా ప్రేమ, పెళ్లి చుట్టూ.. తిరిగే ఎన్నో సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం.. ఇలాంటి ఘటనలు రీల్‌పైనే కాదు.. రియల్‌గా చూసిన సందర్భాలు కూడా ఉంటాయి.. తాజాగా తాన మాజీ ప్రేయసితో మరో వ్యక్తికి వివాహం జరుగుతుంటూ.. మధ్యలో […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటిలకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో జాప్యం వద్దు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి […]
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. వివిధ పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ గూటికి చేరారు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, పలువురు నాయకులు.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , కేంద్ర మంత్రి నఖ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు చింతలగట్టు విఠల్.. పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందించి, […]
ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జోనల్ విధానం వచ్చినప్పట్టి నుంచి బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు.. ఇక, రేపో మాతో ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకోవచ్చు అని నీరక్షిస్తున్నారు.. అయితే, వారికి గుడ్‌న్యూస్ చెబుతూ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించే విధివిధానాలను ఖరారు చేసింది ప్రభుత్వం.. దీనిపై ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ సర్కార్.. […]
మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రత్యేక న్యాయస్థానం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్న ఆమె.. గతంతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఈ శిక్ష విధిస్తున్నట్టు పేర్కొంది కోర్టు.. ఆమె కరోనా నిబంధనలను ఉల్లంఘించారని, మిలిటరీకి వ్యతిరేకంగా ఇతరులను ప్రేరేపించారని రుజువు కావడంతో ఈ తీర్పును వెలువరించింది ప్రత్యేక కోర్టు.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి సూకీపై అనేక ఆరోపణలు మోపబడ్డాయి.. వరుసగా అన్నింటిపై […]
ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిమ్రాన్ ఇప్పటికే 46 దేశాలను చుట్టేసింది.. అందులో భారత్ కూడా ఉంది.. మన దేశంలో 20కు పైగా ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.. మరోవైపు.. విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. టెస్టులను తప్పనిసరి చేసింది.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా టెన్షన్ […]
అంబేద్కర్ చూపిన మార్గంలోనే జనసేన పార్టీ ప్రస్థానం కొనసాగుతోందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ్యాంగ నిర్మాత, భారతరత్నం బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా.. ఓ ప్రకటన విడుదల చేసిన జనసేనాని.. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సర్వదా అనుసరణీయం అన్నారు.. రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయని పేర్కొన్న ఆయన.. నేటి తరం రాజకీయ నాయకుల వికృత వైపరీత్యాలను అంబేద్కర్ ముందే పసిగట్టి […]
రైతు సమస్యలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.. ఇక, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరో రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు.. లోకసభలో స్పీకర్ పోడియాన్ని […]
రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది.. అయితే, దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు.. ఇలా ఒక్కటేంటి.. అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలున్నాయి.. ఇక, అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం వింటుంటాం.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇది ప్రారంభం అయిపోయిందని తెలుస్తోంది.. దీనికి కారణం ఆమ్ఆద్మీ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్.. తాజాగా […]