ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి… ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరుగుతున్నాయి.. భూతలం, గగనతలం నుంచి విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌ను, కీవ్ ఎయిర్‌పోర్ట్ సహా పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది చైనా.. మరోవైపు, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను, విద్యార్థులను స్వదేశానికి రప్పించేపనిలో పడిపోయింది భారత ప్రభుత్వం.. దీని కోసం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.. ఇక, తెలుగు రాష్ట్రాలు సహా.. ఉక్రెయిన్‌లో తమ విద్యార్థులుఉన్న ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. వారి వివరాలతో భారత విదేశాంగశాఖతో సమన్వయం చేస్తున్నారు.
Read Also: Russia-Ukraine War: ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్.. భారత్, చైనా దూరం..
మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది భారత విదేశాంగశాఖ.. భారతీయులు ఎవరైనా ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.. ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లొద్దని.. పశ్చిమ నగరాల్లోనే ఉండాలని పేర్కొంది భారత విదేశాంగశాఖ.. అధికారులతో సమన్వయం లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సరిహద్దు పోస్టులకు పోవద్దని సూచించింది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం.. భారతీయ పౌరుల కోసం ఈ మేరకు ప్రకటన చేసింది.