వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో అంబేద్కర్ భావజాలం ఉంది.. ఈ ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో దేశంలో భిన్నత్వం ఉంటుంది.. అందరినీ ఒకే తాటిపై నడిపించే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారు.. వర్ణ, కుల […]
భారత్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్య మరోసారి స్పల్పంగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 8,306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరో 211 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో.. 8,834 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,41,561కు చేరగా.. రికవరీ కేసుల సంఖ్య 3,40,69,608కి చేరింది.. ఇక, […]
ఏ ఎన్నికలు జరిగినా వంద శాతం పోలింగ్ అనేది చాలా అరుదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు వంద శాతం పోలింగ్ జరిగిన సందర్భాలు ఉండొచ్చు.. కానీ, ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. రాజకీయ పార్టీలు ఎంత ప్రచారం చేసినా.. ఎన్నికల సంఘం ఎన్ని సూచనలు చేసినా.. పోలింగ్‌కు దూరంగా ఉండేవారు చాలా మందే.. అయితే, ఎన్నికల్లో ఓటు వేయనివారికి ఎన్నికల కమిషన్ జరిమానా విధించేందుకు సిద్ధమైందని.. ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంకు […]
మరోసారి కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది… ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. దీంతో.. కూరగాయల ధరలకు క్రమంగా రెక్కలు వచ్చాయి.. ఓ దశలో కిలో టమాటా ధర ఏకంగా రూ.120 వరకు చేరింది.. ఇది హోల్ సేల్ మార్కట్లో పరిస్థితి.. ఇక బహిరంగ మార్కెట్‌కు వెళ్లే సరికి రూ.150గా పలికిందని వ్యాపారులు చెబుతున్నమాట.. అయితే.. వర్షాలు తగ్గిపోవడం.. ప్రభుత్వ చర్యలతో టమాటా ధర దిగివచ్చింది.. కానీ, మరోసారి […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది.. ఇప్పటికే భారత్‌లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి.. కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని గుర్తించిన భారత్.. విస్తృస్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది.. రికార్డు స్థాయిలో 125 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది.. సౌతాఫ్రికా వెలుగుచూసిన ఈ వైరస్ క్రమంగా ప్రంపచదేశాలను పాకిపోతోంది.. ఇక భారత్‌లోనూ ఈ వేరింట్ కేసులు బయటపడ్డాయి.. ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదయ్యాయి.. అయితే, తెలంగాణలో ఈ వేరింయట్ కేసులు ఇంకా వెలుగుచూడలేదు.. విదేశాల నుంచి వచ్చినవారి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ కొనసాగుతోంది.. కోవిడ్ పాజిటివ్‌గా తేలినా.. ఒమిక్రాన్‌గా నమోదైన కేసులు ఇప్పటి వరకు జీరోగానే ఉన్నాయి. కానీ, తెలంగాణకు కూడా ఆ మహమ్మారి […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఇక, మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సంతాప దినాలుగా పాటించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. మరోవైపు, ఉమ్మడి ఏపీలో సీఎంగా, ఆర్థికమంత్రిగా, వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య సేవలను స్మరించుకుంటూ.. మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ […]
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిశేటి రోశయ్య (88) కన్నుమూశారు.. ఆయన మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.. ఇక, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు.. రోశయ్య కన్నుమూతపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోడీ.. ‘‘రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం.. ఇక, తమిళనాడు గవర్నర్‌గా ఆయన పనిచేసినప్పుడు నాకు అనుబంధం ఉంది.. […]
జవాద్ తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు తప్పినట్టుగానే అంచనా వేస్తున్నారు అధికారులు.. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న జవాద్ తుఫాన్.. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బలహీనపడుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.. దీంతో ఉత్తరాంధ్రకు “జవాద్” తుఫాన్ ముప్పు తప్పినట్టేనని.. ఉత్తరాంధ్ర తీరానికి సమీపించి క్రమేపీ బలహీనపడుతూ ఒడిశా వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు.. Read Also: మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం.. సంప్రదింపులతోనే సమస్యలకు పరిష్కారం.. ఇక, జవాద్ తుఫాన్ […]
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.. సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలంటూ కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని.. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని సూచించిన సీజేఐ.. మధ్యవర్తిత్వం […]