ఉక్రెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు.. ఓ వైపు యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, కేంద్రం సహకారంతో వారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఉక్రెయినులో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని తెలిపారు ఏపీలో ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు.. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామన్న ఆయన.. 23 మంది విద్యార్ధులు వస్తున్నారని కేంద్రం సమాచారమిచ్చినా.. అందులో మన రాష్ట్రం వాళ్లు ముగ్గురే ఉన్నట్టు మా పరిశీలనలో తేలిందన్నారు.
Read Also: Russia-Ukraine War: రష్యాకు ఎదురుదెబ్బ.. 3,500 మంది సైనికులు మృతి
ఇక, ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏపీ భవన్ తరపున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు కృష్ణబాబు.. ఢిల్లీకి వచ్చిన వాళ్లను స్వస్థలాలకు పంపేదుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని.. బోర్డర్ వద్దకు రావద్దని కేంద్రం ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు తాజాగా సూచనలు చేసిందని గుర్తుచేశారు. అక్కడ ఉన్న ఏపీ విద్యార్థులు కూడా ఆ మేరకే వ్యవహరించాలని మేమూ సూచించామని తెలిపారు.. సరిహద్దులకు వెళ్లే దుస్సాహసం చేయొద్దని విద్యార్ధులకు సూచిస్తున్నామన్న ఆయన.. ఉక్రెయిన్‌లోని ఏడు యూనివర్శిటీల్లో ఏపీ విద్యార్ధులు చదువుతున్నారని గుర్తించామని.. ఆ ఏడు యూనివర్శిటీలకు సమీపంలో ఉన్న సరిహద్దు దేశమైన రోమేనియాన్ ఎంబసీతో టచ్‌లో ఉంటున్నాం అన్నారు.. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ సివిలియన్స్ ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదన్న ఆయన.. ఎంత మంది ఆంధ్రులు ఉక్రెయిన్‌లో ఉన్నారనే వివరాలను రాబడుతున్నాం. వీసా స్టాపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.