నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ట్రైనీ పైలట్ మృతి చెందారు. ఘటనా సమయంలో దట్టమైన మంటలు చూశామని చెబుతున్నారు స్థానిక రైతులు.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది.. వైద్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? కారణం ఏమై ఉంటుంది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడిపోయారు..
ఇక, శిక్షణ హెలికాప్టర్ కూలిన సమాచారాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులకు చేరవేశారు స్థానిక అధికారులు. అయితే, ఈ ఘటనలో పైలట్‌తో పాటు మహిళా ట్రైనీ పైలట్ మృతిచెందినట్టు అధికారులు చెబుతున్నారు. సాగర్‌లోని ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన చాపర్‌గా గుర్తించారు.. మరోవైపు.. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్ల నుండి ట్రైనీ హెలికాప్టర్ బయల్దేరినట్టు తెలుస్తోంది.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నేలపై కూలిపోయినట్టుగా చెబుతున్నారు.. ఈ ప్రమాదంలో యువ ట్రైనీ పైలట్ దుర్మరణం చెందారు.. మృతురాలు తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించారు.
Read Also: Narayana: విచారణ అక్కర్లేదు.. వైఎస్ వివేకాను ఎవరు చంపారో తెలిసిపోయింది..!