ప్రపంచ దేశాల కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా మహమ్మారి విజృంభణ తగ్గింది.. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా తగ్గింది.. అయితే, ఇప్పటికే ఎంతో మంది దేశాధినేతలను పలకరించింది కరోనా.. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు ఇలా ఎంతో మందిని పలకరించింది మహమ్మారి.. తాజాగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మహమ్మారి బారినపడ్డారు. కొన్ని అనుమానితల లక్షణాలు ఉండడంతో.. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.. దీంతో, వైద్య సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.. కరోనా లక్షణాలతో పాటు జ్వరం కూడా ఉందని తెలిపిన ప్రధాని.. వైద్యుల సలహాను ఫాలో అవుతున్నానని, సిడ్నీలోని తన ఇంట్లో ఐసోలేట్ అయ్యాయని వెల్లడించారు. ఇక, ఐసోలేషన్‌లో ఉంటూనే ఆటంకం లేకుండా తన విధులను నిర్వహించనున్నట్టు ప్రకటించారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్.
Read Also: COVID19 Restriction: రేపటి నుంచి అక్కడ మరిన్ని సడలింపులు..