Ukraine Russia War: పుతిన్‌కు మోడీ ఫోన్.. ఆ లోపు వెళ్లిపోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. ఇక, మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.. దీంతో, ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు) వరకు సమయం ఇచ్చింది రష్యా..
Read Also: Ukraine: మరో భారత విద్యార్థి మృతి
Also Read
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
దీంతో.. ఖార్కివ్‌ను వదిలి వెళ్లాలంటూ భారతీయులకు ఇండియన్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోతే కాలినడకన రండి, పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు వెంటనే వెళ్లాలని సూచించింది.. మరో 4 గంటల్లో ఖార్కివ్‌ను ఖాళీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఇండియన్ ఎంబసీ.. అయితే, రష్యా పెట్టిన డెడ్‌లైన్ తర్వాత ఖార్కివ్‌ను స్వాధీనం చేసుకునే పనిలో రష్యా సేనలు మరింత ముందుకు కదలనున్నట్టు తెలుస్తోంది.. తాము ఇచ్చిన ఆరు గంటల సేఫ్ ప్యాసేజిని వినియోగించుకోవాలని రష్యా సూచిచింది. దీంతో.. విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ముందుకు కదిలేలా చేస్తోంది ఇండియన్ ఎంబసీ.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!