ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అనిపించేది.. వాళ్ల నాన్న (వైఎస్ రాజశేఖర్‌రెడ్డి) లేని లోటు తీరుస్తానని చెప్పా… అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి.. చూడండి.. మళ్లీ అవకాశం రానే వస్తుంది.. మీరు మళ్లీ నిర్ణయం తీసుకోవచ్చునని చెప్పానన్న ఆయన… ప్రజలు వైఎస్ జగన్‌కు మంచి మెజార్టీ ఇచ్చారని తెలిపారు… అయితే, ప్రజల అభిమానం పొందాలి.. కానీ, వారిని చీట్ చేయొద్దు.. మభ్య పెట్టడం చేయకూడదు.. అలాంటి నాయకుడు ఉండకూడదంటూ హాట్ కామెంట్లు చేశారు మేకపాటి.
Read Also: Crude oil: క్రూడాయిల్ మంటలు.. పదేళ్ల గరిష్టాన్ని తాకేసింది..
ఇక, ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలే.. కానీ, సొంత దారులం కాదన్నారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి… అలాగే ప్రవర్తించాలన్నారు.. ప్రజల సొమ్మును ప్రజలకే అప్పగించాలని సూచించిన ఆయన.. ప్రజలకు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు ఇలా అన్ని కార్యక్రమాలు చేయాలన్నారు.. అసలే, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మేకపాటి.. రాష్ట్రం బాగుపడాలంటే.. బాగా పనిచేయాలని గౌతమ్‌రెడ్డికి సూచించానని గుర్తుచేసుకున్న ఆయన… ఆదాయం తెచ్చే శాఖ నీదే.. జాగ్రత్తగా పనిచేయి.. పరిశ్రమలు వచ్చేలా చూడు.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని గౌతమ్‌కు చెప్పానని వెల్లడించారు.. ఇక, 974 కిలో మీటర్ల సీకోస్ట్ ఉంది.. పోర్టులు, హార్బర్లు ఏర్పాటు చేయండి.. పెట్టుబడులు తెమ్మని చెప్పేవాడినన్నారు.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారున్నారు.. హైదరాబాద్‌ను కూడా అభివృద్ధి చేశారని.. హైదరాబాద్ మన రాజధాని అని.. తెలంగాణ ప్రజలే కాకుండా సీమ, ఆంధ్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వెళ్లి పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.. తాను మొదట్లో హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ మాత్రమే ఉండేదన్న ఆయన… ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్లిందన్నారు.. స్టార్ హోటళ్లు, సినిమా థియేటర్లు, పరిశ్రమలు ఎన్నో హైదరాబాద్‌కు తరలివచ్చాయన్న మేకపాటి.. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు.. కానీ, ప్రతి దాంట్లో స్వార్థం ఉండకూడదన్నారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని.. ఈ స్వల్ప కాలంలో వేల కోట్లు సంపాదించి ఏం ఉపయోగం.. తగలేసుకోవడానికా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ప్రజలకు అప్పజెప్పాలి కానీ.. వాడిది లాగేసుకోవడం.. వీడిది లాగేసుకోవడం చేయకూడదని.. మనం స్వచ్ఛంగా, పద్ధతిగా ఉంటే దేవుడు కూడా సాయం చేస్తాడని సూచించారు.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.