Srinivas Goud: మంత్రి హత్యకు స్కెచ్ ఇలా..? రూ.15 కోట్ల డీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర వ్యవహారం తెలంగాణ సంచలనంగా మారిపోయింది.. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర… మహబూబ్ నగర్‌కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాథ్, నాగరాజు ఈ హత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో రూ.15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడిందన్నారు.. ఫిబ్రవరి 23వ తేదీన ఫరూక్, హైదర్ ఆలీలు సుచిత్రాలోని ఓ లాడ్జిలో దిగారని.. 25వ తేదీన లాడ్జీ నుంచి బయటకు వచ్చినప్పుడు కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని చంపేందుకు ప్రయత్నించారన్న సీపీ.. అక్కడ తప్పించుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని వెల్లడించారు.. యాదయ్య, నాగరాజు, విశ్వనాధ్ అనే మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తులు వీరిపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు అందింది. వీరిద్దరిని 26వ తేదీన అరెస్ట్ చేశామన్నారు. రఘు మరికొందరితో కలసి హత్యకు కుట్రపన్నారని పోలీసుల విచారణలో తేలినట్టు తెలిపారు స్టీఫెన్ రవీంద్ర.
Read Also: Srinivas Goud: మంత్రి హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్..!
Also Read
ఇక, కేసులో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజులను ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.. మిగిలిన ముగ్గురిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నామని.. రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూధన్ రాజు, అమరేందర్ కలసి మహబూబ్ నగర్ నుంచి విశాఖ వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు.. అక్కడ షెల్టర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ ఇచ్చారన్న ఆయన.. ఇందులో కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. రాఘవేందర్ రాజు నుంచి రెండు రౌండ్ల 9ఎంఎం, పిస్టల్.. దుండిగల్ ఫారెస్ట్ ఏరియాలో 6 రౌండ్స్ రివాల్వర్ రాజు నుంచి రికవరీ చేసి.. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని.. రాఘవేంద్ర రాజును ప్రశ్నించగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు వీరంతా కుట్ర పన్నినట్లు తేలినట్టు తెలిపారు.. కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పాత్రపై విచారణ జరుపుతున్నామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. జితేందర్‌రెడ్డి.. పీఏ రాజు, డ్రైవర్ థాప, సౌత్ అవెన్యూలోనే షెల్టర్ ఇచ్చినట్లు తెలిసింది. ఘటనలపై లోతైన విచారణ జరిపి హత్య వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనే విషయాలను వెలుగులోకి తీసువస్తామన్నారు. మరోవైపు ఇందులో డీకే అరుణ పాత్రపైనా విచారణ జరుపుతామన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!