ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వ సాధారణమైన విషయం.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన పంతం నెగ్గించుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసిన ఆయన.. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు రావడంతో తన పంతం నెగ్గించుకున్నారు.. జగ్గారెడ్డి […]
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు […]
తెలంగాణలో ఇవాళ వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను.. ఆరింటిని తన ఖాతాలోనే వేసుకుంది గులాబీ పార్టీ.. అయితే, కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది… ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ అయ్యాయి… ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు […]
బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ తీవ్రమైన పోటీయే ఉంటుంది.. ఇక, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ) ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే.. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు… ప్రభుత్త గణాంకాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ నాటికి దేశ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు నిర్మలా సీతారామన్.. […]
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది… అసలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో ఏముంది? ఫిట్మెంట్ 30 శాతం మార్క్ అయినా దాటుతుందా…? అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు.. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి.. అయితే, 11వ వేతన సంఘం ఇప్పటికే 23 శాతం సిఫార్సు చేసింది.. ఇక, కేంద్రం ఇస్తున్నట్లు 14 శాతం సిఫార్సు చేసింది సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. కానీ, కనీసం 30 శాతం ఫిట్మెంట్ అయినా వస్తుందని ఆశలు […]
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా టెన్షన్ పెడుతోంది ఒమిక్రాన్.. యూఎస్‌లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే దాదాపు 30 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మరోవైపు.. కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 మిలియన్లు దాటింది… ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ […]
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది… ఇవాళ ఫలితాలు వెలువడిన అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలు తన ఖాతాలో వేసుకున్న గులాబీ పార్టీ.. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానంలో జరిగిన ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. ఈ నెల 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ జరగగా.. ఇవాళ ఉదయం 8 గంటలకు […]
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన ఫలితాలు వెలువడుతున్నాయి.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది.. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.. 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని నమోదు చేశారు ఎంసీ కోటిరెడ్డి.. నల్గొండ స్థానంలో మొత్తం 1,233 ఓట్లు ఉండగా… చెల్లని ఓట్లు 50 మినహాయిస్తే.. 1,183 ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు.. అందులో గెలుపు కోటా 593 ఓట్లు అయితే.. టీఆర్ఎస్ అభ్యర్థి […]
సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ మొదలైంది.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్ డోస్‌పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్ బెటరా..? కోవిషీల్డ్ […]
అంతర్జాతీయ మార్కెట్‌కు తోడు స్థానిక డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పసిడి ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.. సీజన్‌ను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉంటాయి.. మరోసారి బంగారం ధర పైకి కదిలింది.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,120కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,220కి ఎగిసింది.. ఇక, బంగారం ధరలోనే వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది.. కిలో వెండి […]