ఉక్రెయిన్-రష్యా వార్ ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు శాంతి చర్చలకు కూడా సిద్ధం అవుతున్నారు.. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో.. బెలారస్‌లో రెండవ విడత శాంతి చర్చల కోసం ప్రతినిధులను పంపామని చెబుతోంది రష్యా.. అయితే, రష్యా చర్చలు జరపాలనుకుంటే వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీంతో, చర్చలు ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.. మరోవైపు, రష్యా దాడులు మొదలైన తర్వాత 9 లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్‌ను వదిలి వెళ్లిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. అత్యంత వేగంగా, యూరప్‌లో దశాబ్దాలుగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాన్ని వీడి వెళ్లలేదని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది.. మరోవైపు ఇప్పటికే రష్యా దాడుల్లో 2 వేలకు పైగా ఉక్రెయిన్ పౌరులు మృతిచెందారు.. రష్యా దాడుల్లో చిన్న పిల్లల స్కూళ్లు, ఆసుపత్రులు, జనావాసాలు ధ్వంసం అవుతున్నాయి.. ఇక, రష్యాను కూడా పలు అంతర్జాతీయ సంస్థలు వీడుతున్నాయి.. ఆ జాబితో ఆపిల్, ఎక్సాన్, బోయింగ్ సంస్థలు కూడా ఉన్నాయి.. దీంతో ఆర్ధికంగా, దౌత్యపరంగా ఏకాకి అవుతోంది రష్యా..