హ్యాకర్స్ అదును చూసి సోషల్ మీడియా ఖాతాలపై దాడులు చేస్తూనే ఉన్నారు.. ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలకు సంబంధించిన సోషల్ మీడియాల ఖాతాలను హ్యాక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ.. మరికొందరు కేంద్ర మంత్రుల ఖాతాలు.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.. ఇవాళ సమాచార […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడే పొత్తుల గురించి చర్చ సాగుతోంది.. అయితే, అదంతా కొందరు ఆడుతోన్న మైండ్ గేమ్.. దానికి త్వరలోనే చెక్ పెడతాం అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివేకానందుని స్ఫూర్తిని నింపుకున్న యువతదే అభివృద్ధిలో కీలక పాత్ర అన్నారు.. యువతను ప్రభావితం చేసేలా కొందరు మైండ్ గేమ్స్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ఏపీలో […]
భారత్‌కు యువతే బలం.. ఈ ఏడాది వారికి చాలా కీలకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. పుదుచ్చేరిలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సాంకేతిక కేంద్రం ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్‌లో ఎంస్ఎంఈ పాత్ర చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు.. ఇక, ప్రపంచాన్ని మార్చే సాంకేతికతను ఎంఎస్ఎంఈ రంగంలో ఉపయోగించడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఆ దిశగా కీలక ముందడుగు వేసేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.. ఇక, జాతీయ […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. ఒక్కోసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం 2 వేల వైపు పరుగులు పెడుతూనే ఉంది.. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్న పయ్యావుల కేశవ్‌కు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సూచలన మేరకు ఆయన […]
ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్ […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..? […]
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది.. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా ఆ దేశంతో మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.. ఈ లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 మ్యాచ్‌లలో 1,161 పరుగులతో […]
హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై చేసిన ఓ కామెంట్ పెద్ద దుమారమే రేగింది.. ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావించిన సైనా.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోడీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.. అయితే, సైనా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను […]
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు కాస్త తగ్గినా కోవిడ్ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోవిడ్ టచ్ చేసింది.. సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు కోవిడ్ బారినపడగా.. మరోవైపు రాజకీయ నేతలను కూడా కోవిడ్ వదలడం లేదు.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది… దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీలో […]