తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు ప్రజలు.. వేకువజామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. వాడవాడలా భోగిమంటలు వేసి.. పెద్దలు, చిన్నారులు అంతా కలసి సందడిగా గడిపారు.. ఇక, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా భోగి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.. ప్రకాశం జిల్లా కారంచేడుకు విచ్చేసిన సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి […]
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇది గుర్తించిన అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. ఇక, భారత్‌లో దేశీయంగా తయారై.. అనుమతి పొందిన వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఒకటి… తాజాగా, మరో అరుదైన ఘనత సాధించింది కొవాగ్జిన్.. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకా ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా గుర్తింపు పొందింది.. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది.. Read Also: […]
విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే […]
మహా నగరం హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది… ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ స్థాయిలో కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి.. ప్లాట్లు, ఇళ్లు ఇలా రెగ్యులర్‌గా క్రయ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. ప్రతిష్టాత్మక సంస్థలు రంగంలోకి దిగి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు.. ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నాయి.. కొన్ని చోట్ల ఇప్పటికే ఓఆర్ఆర్ను దాటేసి రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది… రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా బిజినెస్ […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని చేతివృత్తులు, చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధికానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. భాగస్వామికుల మధ్య చీలికలు వచ్చే ఆస్కారం ఉంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు గృహంలో మార్పులు, మరమ్మతులు వాయిదా వేయటం మంచిది. ప్రముఖుల కలయిక సాధ్య పడుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. […]
పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు హీటు పుట్టిస్తున్నాయి.. మరోసారి అధికారం మాదే అంటోంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తమను అధికారాన్ని తెచ్చిపెడతాడని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.. ఇంకో వైపు.. ప్రజలను ఆకట్టుకునే పనిలో పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ… ఇప్పటికే పలు ఆకర్షణీయమైన హామీలను కూడా కురిపించారు.. తాజాగా, పంజాబ్ ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిని కూడా దాదాపుగా ఖరారు చేశారు అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎంగా భగవంత్‌ను […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ […]
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది అంటూ మండిపడ్డారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. యూపీలో మంత్రిగా ఉండి రాజీనామా చేసిన మౌర్య పై ఏడేళ్ల క్రితం పెట్టిన కేసులు బీజేపీ బయటకు తీసి వేధిస్తోందని.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఫైర్ అయ్యారు. ఇక, ధరల నియంత్రణలో బీజేపీ ఘోరంగా విఫలం అయ్యిందని విమర్శించిన రాఘవులు.. ఎరువుల ధరలు నియంత్రణ పై […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… 2017 ఉన్నావ్ అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా… ఇప్పుడు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంది. 19 ఏళ్ల బాధితురాలి తల్లి పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు విడుదల చేశారు. బాలికపై అత్యాచారం కేసులో […]
ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. కరోనా నేపథ్యంలో ఈ పొట్టి ఫార్మాట్‌ను స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోయింది.. ఇక, స్వదేశంలోనూ మ్యాచ్‌లు జరిగే పరిస్థితి లేదు.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడాల్సిందే.. అయితే, ఐపీఎల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు.. ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. ఈ ఐపీఎల్ […]