ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారంపై దృష్టి సారించింది కేంద్రం హోంశాఖ.. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంమత్రిత్వశాఖ లేఖ రాసింది. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరిన విషయం తెలిసింది.. అందులో భాగంగా ఇవాళ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమావేశం కానున్నారు. మొదట ఢిల్లీలో ప్రత్యక్షంగా ఈ సమావేశం […]
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది.. అంటే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.. కాగా, శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు.. ఇక, 1949లో వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోవైపు వైకుంఠ ద్వార […]
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థికపరమైన చర్చలు అర్థాంతరంగా ముగుస్తాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ యత్నాలకు కుటుంబీకుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. నూతన కాంట్రాక్టులు చేపడతారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. దూర ప్రయాణాలలో […]
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ దశలో ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా మారింది.. అయితే, ఈ వ్యవహారం మరింత రచ్చగా మారకుండా సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంలో చర్చలు జరపడం.. ప్రభుత్వం కమిటీ వేయడం.. ఆ కమిటీ వరుసగా సమావేశాలు అవుతూ.. వివిధ సమస్యలపై చర్చించడం జరుగుతోంది.. మరోవైపు.. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగానే మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని సందర్భాల్లో మైక్ […]
గత కొంతకాలంగా మళ్లీ కరోనా పంజా విసురుతోంది.. అన్ని రాష్ట్రాలు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత నుంచి అంటే ఈ నెల 17వ తేదీ నుంచి వర్చువల్ విధానంలోనే […]
సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చ హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం […]
భారత దేశంలో మూడో అతి పెద్ద టెలికం సంస్థగా పేరు పొందిన వొడాఫోన్ – ఐడియా లిమిటెడ్‌లో మెజార్టీ వాటాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి.. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.. అయితే, ఈ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్లో వొడాఫోన్ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి.. అయితే, కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా సర్కార్ చేతిలోకి వెళ్లింది.. టెలికం మార్కెట్లో పోటీ కారణంగా.. […]
ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు పేదవాళ్లకు ఇప్పటికే పంపిణీ చేశామని గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఎంఐజీ వెబ్ సైట్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.. మధ్య తరగతి కుటుంబాలకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్ కంటే తక్కువకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.. ప్రభుత్వమే అభివృద్ధి చేసి, ప్లాట్లను ఇస్తుంది.. […]
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది.. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించింది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్.. అయినా.. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మినహాయించిన కేటగిరీకి చెందిన ప్రైవేట్ కంపెనీలు మినహా అన్ని ఆఫీసులు మూసివేయాల్సిందేనని పేర్కొంది.. ఇప్పటి వరకు, […]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది.. కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు మెడికల్ సిబ్బంది కరోనా బారిన పడగా.. తాజాగా మరో 15 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో, కాకతీయ మెడికల్ కాలేజీలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 44కు చేరుకుంది. కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లతో సహా 29 మంది మెడికోలకు నిన్న మధ్యాహ్నం వరకు […]