TRS: కేంద్రంపై ఒత్తిడి.. ఢిల్లీలో.. గల్లీలోనూ పోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రెండు వైపుల నుంచి ఒత్తిడి చేస్తోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ… ఓవైపు ధాన్యం, బియ్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి.. ఒత్తిడి తెచ్చే ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు.. గల్లీలోనూ బీజేపీపై పోరు సాగిస్తోంది.. గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సూచించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
ఇక, ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలవనున్నారు తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల బృందం.. ఇప్పటికే గోయల్‌ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కేకే.. నలుగురు మంత్రులు ఢిల్లీ వచ్చారని గోయల్‌కు వివరించారు. మంత్రులకు, ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని గోయల్‌ను కేశవరావు కోరారు. రేపు షెడ్యూల్ చూసుకుని సమయం ఇచ్చేందుకు పరిశీలిస్తానని పీయూష్ గోయల్ కేకేకు తెలిపారు… ఈ తర్వాత ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.. అయితే, వన్ నేషన్–వన్ ప్రొక్యూర్‌మెంట్ నినాదంతో, పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర మంత్రుల బృందం హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన ఈ బృందంలో నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. మొత్తంగా.. ఢిల్లీతో పాటు గల్లీలోనూ బీజేపీపై పోరు చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!