SriLankan Crisis: ఆర్థిక సంక్షోభం తీవ్రం.. దుర్భర పరిస్థితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా శ్రీలంక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వంటగ్యాస్, నిత్యావసరాలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంధనం కోసం ఫిల్లింగ్ స్టేషన్‌ల వద్ద క్యూలైన్‌లో గంటలకొద్దీ నిల్చోలేక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆందోళనకు దిగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. దీంతో శ్రీలంక సర్కారు పెట్రోలు బంకుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు తోడుగా సైనిక బలగాలను మోహరింపజేసింది. శ్రీలంకలో నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగిశాయి. ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం లంకలో కిలో చికెన్ ధర వెయ్యి కాగా.. ఒక గుడ్డు ధర 35 రూపాయలు దాటిపోయింది. ఏదీ కొనే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో లంకేయులు ఆకలితో అలమటించాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి పరిస్థితుల్లో లంకలోని తమిళులు.. శరణార్థులుగా మారి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20 మంది శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా తమిళనాడుకు చేరారని తెలుస్తోంది. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు.
Read Also: High Court: ప్రమాణం చేసిన 10 మంది కొత్త న్యాయమూర్తులు
Also Read
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్‌క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
కోవిడ్ వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచి శ్రీలంకను కష్టాలు చుట్టుముట్టాయి. కరోనా కారణంగా దేశానికి పర్యాటకుల రాక తగ్గింది. విదేశాల్లో పనిచేసే శ్రీలంక పౌరుల సంఖ్య కూడా క్రమేపీ తగ్గడంతో విదేశీ కరెన్సీ నిల్వలపై ప్రభావం పడింది. ద్రవ్యోల్బణంతో ప్రజల కొనుగోలు సామర్థ్యం చాలా తగ్గిపోయింది. ఇలా పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారడంతో లంక తమిళులు భారత్ వైపు మల్లుతున్నారు. తమిళనాడు తీరం రామేశ్వరం, ధనుష్కోటిలకు లంక తమిళులు వస్తున్నారు. ఇప్పటికే ఇలా వచ్చిన 16 మందిని కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఇలాగే కొనసాగితే.. మరింత మంది లంక తమిళులు.. భారత్‌కు శరణార్థులుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
-
Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
-
Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!