మేష రాశి: ఈ రోజు ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు పురోగమిస్తాయి. బంగారం, వెండి వ్యాపారులకు బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది.వృషభ రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆరోగ్యంతో పాటు కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితిని మెరుగవుతుంది. మీరు కుటుంబంలోని పెద్దల మాట వినవలసి రావచ్చు. […]
టెక్ దిగ్గజం గూగూల్ కీలక నిర్ణయం తీసుకుంది.. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోనూ మార్చబోతోంది.. 2014లో క్రోమ్ లోగోలో స్వల్పంగా మార్పులు చేసిన గూగుల్.. ఇప్పుడు.. అంటే ఎనిమిదేళ్ల తర్వాత దాని డిజైన్‌ను మార్చేస్తోంది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది టెక్ దిగ్గజం.. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ ఖాతాల్లో ఈ విషయాన్ని షేర్ చేశారు. Read Also: పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే.. సమాజంలో మార్పు.. వారి చరిత్ర […]
నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ప్రకాశం జిల్లాలో విషాదంగా మారింది.. పెళ్లి చేసుకుని నెల దాటిందో లేదో.. అప్పుడే ఆ ఇద్దరు దంపతులు ప్రాణాలు తీసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ప్రియాంక-మహానందికు వివాహం జరిపించారు పెద్దలు.. ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు మహానంది.. అయితే, వారి కుటుంబంలో కలహాలు ఏర్పడినట్టుగా తెలుస్తోంది.. దీంతో.. ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.. దీంతో ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం […]
సమాజంలో మార్పు రావాలంటే.. పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే అది సాధ్యం అవుతుందన్నారు స్వామి పరిపూర్ణానంద.. శ్రీకాకుళంలో జరిగిన సమాలోచన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. దేశభక్తి పెంపొందించాలంటే బాబర్, హుమయూన్, ఖిల్జీల చరిత్ర పాఠ్యంశాలలో చించేయాలన్న ఆయన… అశోకుడు, రాణాప్రతాప్, శివాజీ, వివేకానందుడి చరిత్ర నాన్ టేయిల్లో పెట్టాలని కోరారు.. ఇక, సన్యాసులు వేదాంతం చెప్పడమే కాదు.. సమూలమైన మార్పుకి దోహాదపడాలని సూచించారు పరిపూర్ణానంద.. […]
కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు […]
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. పంజాబ్‌లోనూ ఎన్నికలు జరగబోతున్నాయి.. మరోసారి పంజాబ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు ముందే.. సీఎం అభ్యర్థిని ప్రకటించారు రాహుల్ గాంధీ.. ప్రస్తుతీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపేరునే మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.. దీంతో.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీప్‌గా ఉన్న నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటి వరకు బహిరంగంగా అంతా బాగానే […]
తెలంగాణలో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,217 కొత్త కేసులు నమోదు కావడంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,530కి చేరింది.. మరో కోవిడ్ బాధితుడు మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,100కు చేరగా.. మరో 3,944 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 7,46,932కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టివ్ […]
భారత్‌లో డిజిటల్ కరెన్సీ లాంచ్ గురించి ఎప్పటి నుంచే చర్చ సాగుతోంది.. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే కాగా..? అసలు డిజిటల్ కరెన్సీ దేశంలో ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. వచ్చే ఏడాదిలో డిజిటల్ కరెన్సీ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నమాట.. ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ మాదిరిగానే.. ఇది పనిచేస్తుందని చెబుతున్నారు.. ఇక, ఆ కరెన్సీకి ప్రభుత్వ […]
బీజేపీ నాయకులు అబద్ధాలు మాట్లాడితే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు కళ్లముందే ఉన్నాయన్న ఆయన.. ఇక్కడకు వచ్చి బండి సంజయ్ డ్రామా ఆడారని మండిపడ్డారు. అంబేద్కర్ సృతి వనాన్ని బండి సంజయ్ అపవిత్రం చేశారంటూ ఫైర్ అయిన ఆయన.. బీజేపీ నాయకులకి నిజం చెప్పే దమ్ము లేదన్నారు.. ఇక్కడికి వచ్చి బీజేపీ డ్రామా చేసింది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, 2022 […]