Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabharata Lessons: మహాభారతం…అది కేవలం పాండవులు – కౌరవుల మధ్య జరిగిన యుద్ధం కాదు. యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పించిన గ్రంథం! అవును! 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామంలో లక్షల మంది యోధులు పోరాడారు. అంతటి మహాసంగ్రామంలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగేది. నిరాయుధుడిపై దాడి చేయడం అధర్మం. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం నిషిద్ధం. పిల్లలు, మహిళలు యుద్ధానికి దూరం. కానీ నేడు ప్రపంచం అభివృద్ధి చెందింది. ఆయుధాలు ఆధునికమయ్యాయి. కానీ యుద్ధాల నీతి? అది మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రి చీకట్లోనే క్షిపణులు ఎగురుతున్నాయి. నిద్రలో ఉన్న నగరాలు పేలుళ్లతో మేల్కొంటున్నాయి. సైనికులకంటే సామాన్యులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కురుక్షేత్రం మనకు నేర్పిన పాఠాలను ఆధునిక ప్రపంచం మరచిపోతోందా అనే ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇలాంటి మహాభారత యుద్ధంలో తలచుకుంటే యుద్ధ ఫలితాన్నే మార్చగల నలుగురు మహా శక్తులు మాత్రం ఆయుధాలు పట్టలేదు. వాళ్లు రంగంలోకి దిగి ఉంటే మహాభారతం కథే మరోలా ఉండేదేమో! ఇంతకీ ఎవరా నలుగురు? మొదటివాడు, బలరాముడు..! అంటే శ్రీకృష్ణుడి అన్నయ్య. అపారమైన బలానికి ప్రతీక. హస్తినాపురాన్నే తన నాగలితో గంగలోకి లాగగల శక్తి ఉన్న యోధుడు. ఒకవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడు. మరోవైపు సొంత తమ్ముడు శ్రీకృష్ణుడు. ఎవరి పక్షం తీసుకున్నా ధర్మం గాయపడుతుందని భావించిన బలరాముడు. యుద్ధానికి దూరంగా నిలిచాడు. నేటి ప్రపంచంలో కూడా యుద్ధాన్ని ఆపగల శక్తి ఉన్న దేశాలు ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో అవి మధ్యవర్తులుగా కాకుండా పక్షాలుగా మారిపోతున్నాయి. బలరాముడు శక్తి కంటే తటస్థతను ఎంచుకున్నాడు.
ఇక రెండోవాడు రుక్మి. శ్రీకృష్ణుడి బావ. పరాక్రమంలో గొప్పవాడు. కానీ అవమానం కొన్నిసార్లు ఖడ్గం కంటే లోతైన గాయాన్ని చేస్తుంది. పాత పగలు, వ్యక్తిగత కక్షలు ఎంతటి మహా యోధుడినైనా యుద్ధం నుంచి దూరం చేయగలవని రుక్మి కథ చెబుతుంది. మూడోవాడు బార్బరీకుడు. ఇతను భీముడి మనుమడు, కేవలం మూడు బాణాలతో యుద్ధరంగాన్ని ఖాళీ చేయగల మహావీరుడు. కానీ ఆయన చేసిన ఒక ప్రతిజ్ఞ ఓడిపోయే పక్షానికే తోడుగా నిలబడతానన్న మాట చివరికి యుద్ధ సమతుల్యతనే దెబ్బతీసే ప్రమాదంగా మారింది. అందుకే శ్రీకృష్ణుడు అతని శక్తిని కాదు. అతని త్యాగాన్ని ఎంచుకున్నాడు. నేడు కూడా ఇదే ప్రశ్న. శక్తి ఎవరి చేతిలో ఉంది అనేది కాదు. ఆ శక్తి ఎవరి కోసం ఉపయోగపడుతోంది అనేదే అసలు విషయం. ఇక నాలుగోవాడు విదురుడు. ఇతను ధర్మానికి మరో పేరు. అధర్మం గెలుస్తున్న సభలో నిలబడలేక, అధర్మం కోసం ఆయుధం పట్టలేక, ధర్మాన్ని వదిలి వెళ్లలేక, ఆయన తటస్థంగా నిలిచిపోయాడు. ఈ విధంగా చూస్తే మహాభారతం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. యుద్ధంలో గెలవడం గొప్ప కాదు… ధర్మాన్ని కాపాడటం గొప్ప. అప్పుడు యుద్ధాలకు నియమాలు ఉండేవి… ఇప్పుడు నియమాలకే యుద్ధం జరుగుతోంది. అప్పుడు రాజులు యుద్ధం చేసేవారు… ఇప్పుడు సామాన్యులే మూల్యం చెల్లిస్తున్నారు. కురుక్షేత్రం ముగిసిపోయి వేల ఏళ్లు కావొచ్చు… కానీ అది అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా బ్రతికే ఉంది.
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
తాజావార్తలు
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!