ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు కలకలం సృష్టించాయి.. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా.. ఆయన వాహనంపై కాల్పులు జరిపారు.. అయితే, ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు.. అంతా సురక్షితంగా బయటపడ్డారు.. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సచిన్ పండిత్ నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.. అసదుద్దీన్ ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు […]
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్నాయి.. జిల్లా పేరు కోసం కొందరు.. జిల్లా కేంద్రం కోసం మరొకరు.. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇంకొద్దరు డిమాండ్ చేస్తున్నారు.. అలాంటి జిల్లాలో ఒకటి అనంతపురం జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న సత్యసాయి జిల్లా.. దీనిపై ర్యాలీ చేసి దీక్షకు దిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హిందూపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. అన్ని రకాలుగా హిందూపురం అభివృద్ధి చెందింది.. జిల్లా కేంద్రంలో […]
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.. ఓవైపు కరోనా.. మరోవైపు.. కరోనా కట్టడి కోసం లాక్డౌన్, కర్ఫ్యూలు.. ఆర్థికంగా చాలా మందిని దెబ్బకొట్టాయి.. దీంతో.. రెగ్యులర్‌గా ఈఎంఐలు కట్టేవారు కూడా చెల్లించలేని పరిస్థితి.. పాలసీలు కట్టలేక చేతులెత్తేసినవారు ఎందరో.. అయితే, అలాంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పింది.. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)… వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం.. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. పాలసీ […]
ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ, క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం అమెజాన్ సంచలన రికార్డు నెలకొల్పింది.. తాజాగా, అమెజాన్ విడుదల చేసిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. ఆ సంస్థ షేర్లు 13.5 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ సుమారు 190 బిలియన్ డాలర్లకు అంటే.. రూ.14.18 లక్షల కోట్లుకు పెరిగింది.. Read Also: అనుమానాస్పదంగా తిరిగిన కోడి.. అరెస్ట్ చేసిన పోలీసులు.. గత నెల 28వ తేదీన ఐఫోన్ తయారీ సంస్థ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్ట్‌ల సంఖ్యతో పాటు.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,838 శాంపిల్స్ పరీక్షించగా.. 3,396 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో తొమ్మిది మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు కోవిడ్‌తో ప్రాణాలు విడిచారు.. ఇక, ఒకే రోజు 13,005 మంది కోవిడ్ బాధితులు […]
కొన్ని ప్రాంతాల్లో మనుషులే కాదు.. ఏదైనా జంతువు, పక్షులు తిరిగినా అనుమానించే పరిస్థితులు ఉంటాయి.. ఇలాంటి వింత పరిస్థితి ఓ కోడికి ఎదురైంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది అగ్రరాజ్యం అమెరికా.. ఆ కోడి తిరిగిన ప్రదేశం.. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్.. అదే ఆ కోడి చేసిన పాపం అయ్యింది.. వెంటనే రంగంలోని దిగిన పోలీసులు.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ కోడిని పట్టుకుని.. స్టేషన్లో పెట్టారు.. ఆ తర్వాత క్షుణ్ణంగా ఆ కోడికి పరీక్షలు నిర్వహించారు. […]
ప్రభుత్వాలు మారడం.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలో కూర్చోవడం.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాస్తా అధికార పగ్గాలు చేపట్టడం జరిగిపోతూనే ఉంటాయి.. అయితే, తమ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని సమస్యలను కూడా.. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు లేవనెత్తి విమర్శలు చేస్తుంటారు.. ఇప్పుడు మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.. అసలు విషయానికి వస్తే.. ముంబై ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఓ […]
తరచూ విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కీలక వ్యక్తులను కూడా కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, పెరూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది… టూరిస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్దసేపటికే కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటనకు టూరిస్టులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. ఐదుగురు పర్యాటకులతో పాటు పైలట్, కో పైలట్ కూడా అక్కడికక్కడే మృతిచెందారు.. మృతిచెందిన పర్యాటకుల్లో ముగ్గురు […]