Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ గురించి నెట్టింట ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్ఫుల్ క్యామియో చేయబోతున్నారట. కేవలం అతిథి పాత్రలా వచ్చి వెళ్ళిపోయేలా కాకుండా, కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న రోల్ అని సమాచారం. సినిమా కథను ఒక కీలకమైన మలుపు తిప్పే సందర్భంలో హృతిక్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని సమాచారం. టైగర్ ముత్తూవేల్ పాండియన్ కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో హృతిక్ పాత్ర ఉండబోతుంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసే సన్నివేశాలను మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో గ్రాండ్‌గా విజువలైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
జూన్ మూడో వారంలో, ముఖ్యంగా జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో ఈ కీలక షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ షూటింగ్లో పాల్గొనడానికి ముందే హృతిక్ రోషన్‌పై లుక్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ సినిమాలో హృతిక్‌ను మునుపెన్నడూ చూడని ఒక కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నారట. అలాగే ఈ రోల్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా, హై-వోల్టేజ్ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా దాదాపు 40 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. గతంలో 1986లో వచ్చిన ‘భగవాన్ దాదా’ అనే హిందీ సినిమాలో హృతిక్ బాలనటుడిగా రజనీకాంత్‌తో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ‘జైలర్ 2’ ద్వారా ఈ ఇద్దరు స్టార్స్ కలవబోతుండడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి వంటి స్టార్స్ కూడా భాగం కానుండడంతో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి.
Also Read
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
తాజావార్తలు
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!