ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వ్యవహారం మరోసారి పార్లమెంట్లో కాకరేపింది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ కుంటిసాకులే అంటూ రాజ్యసభలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.. ప్రధానంగా రెండు అంశాలపై మాట్లాడారు […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంక్షేమ పథకాలతో నేరుగా ప్రజల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పటికే గనన్న చేదోడు పథకం కింద రాష్ట్రంలోని దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. వరుసగా రెండో ఏడాది నగదును ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రెండో విడతలో రూ.285 కోట్లను విడుదల చేసేందుకు సిద్ధం […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్థిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి పనితీరు, వాగ్దాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి, […]
ఇప్పటికే పాత పాలసీలను రెన్యువల్ చేసుకునే సౌలభ్యాన్ని కల్సించి గుడ్‌న్యూస్ చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ).. ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ చెప్పింది.. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ.. త్వరలో ఐపీవోకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ ఐపీవోలో పాల్గొనే పాలసీదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.. ఐపీవోలో 10 శాతం డిస్కౌంట్ పాలసీ దారులకు ఇవ్వనున్నట్టు పేర్కొంది.. అయితే, ఎల్ఐసీ యొక్క ప్రారంభ పబ్లిక్ ఆఫర్లో షేర్లను కొనుగోలు చేయడానికి ఈ […]
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాగే.. సింగరేణిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్… సింగరేణి కార్మికులు సమ్మె చేసినా ప్రైవేట్ పరం చేసే కుట్ర మోడీ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఈ పరిణామాలన్నీ తెలంగాణపై బీజేపీ కక్ష కట్టడమే తప్పితే ఇంకోటి కాదన్నారు.. విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలని రిక్వెస్ట్ ఉన్నా… నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. విశాఖ ఉక్కు […]
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నేల మీద నడవాలని సూచించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజురాబాద్ ఎన్నికల కోసం ఎన్నో హామీలు ప్రొసీడింగ్స్ ఇచ్చారు.. హుజురాబాద్ ఎన్నికలు.. దళితుల మీద ప్రేమ, వారి అభివృద్ధి కోసమే ఒక రీసెర్చ్ సెంటర్ లాగా చేసిండ్రు అని దుయ్యబట్టారు.. కేసీఆర్ కి దళితుల ఓట్లు తప్ప వారిమీద ప్రేమతో కాదు అని మండిపడ్డ ఈటల.. ఈరోజు దుఃఖం […]
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేసీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్… సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారంగా తెలిపిన ఆయన.. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని హెచ్చరించారు.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందన్న ఆయన.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుంది.. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని […]
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జిల్లాలోని ఊరుకొండ సమీపంలో ఇన్నోవా వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు.. వివాహ వేడుక కోసం బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.. అయితే, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల […]