Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
- ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ఘట్టం
- ఆస్ట్రేలియాపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్
- ఆస్ట్రేలియాకు వరుసగా రెండో వన్డే సిరీస్ పరాజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Suffer Another Setback as Bangladesh Create ODI History: ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని బంగ్లాదేశ్ టీమ్ నమోదు చేసింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సిరీస్‌ను కైవసం చేసుకుని.. కొత్త చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సంపాదించింది. పటిష్ట ఆస్ట్రేలియాపై మరో మ్యాచ్ మిగులుండగానే బంగ్లాదేశ్ సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. మూడో వన్డేలో కూడా గెలిస్తే.. ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా మరో రికార్డు కూడా సొంతం అవుతుంది.
వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్-లూయిస్-(డీఎల్ఎస్) పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్‌కు 41 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. బంగ్లాదేశ్ విజయంలో తౌహిద్ హృదోయ్ (40 నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 22 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
- Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
- Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
లక్ష్య ఛేదనలో ప్రారంభంలోనే తంజిద్ హసన్ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్‌ను నజ్ముల్ హొసైన్ శాంటో, సౌమ్య సర్కార్ ఆదుకున్నారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించింది. శాంటో 42 పరుగులు చేయగా, సౌమ్య 42 పరుగులతో రాణించాడు. అనంతరం లిటన్ దాస్ 18, మొసద్దెక్ హొసైన్ 15 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. జట్టు స్కోరు ఖాతా తెరవకముందే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వన్డే చరిత్రలో ఒక జట్టు పరుగులేమీ చేయకుండానే మూడు వికెట్లు కోల్పోవడం ఇది నాలుగోసారి.
మాథ్యూ షార్ట్, కూపర్ కానోలీ, మ్యాట్ రెన్షా డకౌట్ కాగా.. అలెక్స్ కేరీ 13 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ 34, కామెరూన్ గ్రీన్ 25 పరుగులు చేసినప్పటికీ జట్టును ఆదుకోలేకపోయారు. ఒక దశలో ఆస్ట్రేలియా 81 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మార్నస్ లబుషేన్, జేవియర్ బార్ట్లెట్ కలిసి ఏడో వికెట్‌కు 103 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. లబుషేన్ 55 పరుగులతో అజేయంగా నిలవగా.. బార్ట్లెట్ 52 పరుగులు చేశాడు. వర్షం కారణంగా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 42 ఓవర్లకే ముగియగా.. జట్టు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
విజయం అనంతరం బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ నజ్ముల్ హొసైన్ శాంటో మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన అనుభూతి. గత కొన్ని నెలలుగా కఠినంగా శ్రమిస్తున్నాం. ఈ సిరీస్‌లో జట్టు చూపించిన పోరాట పటిమపై గర్వంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ స్వదేశంలో వరుసగా ఐదో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లపై కూడా సిరీస్ విజయాలు అందుకుంది. మరోవైపు ప్రపంచ వన్డే చాంపియన్ ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో వన్డే సిరీస్ పరాజయం కావడం విశేషం.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Xiaomi TV A Pro e Series: 85 ఇంచెస్ వరకు 4K QLED టీవీలు లాంచ్ చేసిన షియోమి.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!