Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: రైల్వే ప్రయాణికుడికి సంబంధించిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రైలు గంటల కొద్దీ ఆలస్యంగా రావడంతో స్టేషన్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చిన ఓ వ్యక్తికి, ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందని రైల్వే అధికారులు రూ.500 జరిమానా విధించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది.
జూన్ 11న తన బంధువులను రైలెక్కించేందుకు ఆ వ్యక్తి కళ్యాణ్ జంక్షన్‌కు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో రైలు రావాల్సి ఉండటంతో తీసుకోవాల్సిన ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుగోలు చేసి స్టేషన్లోకి ప్రవేశించాడు. అయితే అనుకోని విధంగా రైలు చాలా ఆలస్యంగా స్టేషన్ కు చేరుకుంది. నిజానికి సదరు రైలు మధ్యాహ్నం సమయానికి రావాల్సి ఉండగా.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఏకంగా 5 గంటల పాటు ఆలస్యంగా రావడంతో ఆ వ్యక్తి కూడా స్టేషన్ లోనే వేచి ఉండాల్సి వచ్చింది.
Also Read
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
సదరు వ్యక్తి బంధువులను రైలెక్కించిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా.. రైల్వే సిబ్బంది టికెట్ల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్ గడువు ముగిసిందని అధికారులు గుర్తించారు. రైల్వే నిబంధనల ప్రకారం టికెట్ చెల్లుబాటు కాకపోవడంతో రూ.500 జరిమానా + రూ.20 ఫ్లాట్ ఫామ్ టిక్కెట్ ధర కలుపుకొని రూ.520లు మొత్తం జరిమానాగా విధించారు.
రైలు ఆలస్యం అయిందన్న విషయం తెలిపినా కానీ.. అధికారులు వినకపోగా జరిమానా విధించారు. ఈ ఘటనతో రైల్వే నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది. భారతీయ రైల్వే నియమాల ప్రకారం ప్లాట్‌ఫామ్ టికెట్లు నిర్దిష్ట సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అవి రైలు రాకపోకల సమయాలతో సంబంధం లేకుండా, స్టేషన్లో ప్రవేశించిన సమయాన్ని ఆధారంగా తీసుకుని అమల్లో ఉంటాయి. అయితే రైలు ఆలస్యం కావడం ప్రయాణికుడి నియంత్రణలో లేని విషయం కాబట్టి.. ఇలాంటి సందర్భాల్లో మినహాయింపులు ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైల్వే వ్యవస్థ కారణంగా ఏర్పడిన ఆలస్యానికి ప్రయాణికుడే జరిమానా చెల్లించాల్సి రావడం న్యాయమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆ వ్యక్తికి మద్దతుగా నిలుస్తూ.. రైల్వే ఆలస్యాల కారణంగా ప్రయాణికులు నష్టపోవడం సరైంది కాదని అంటున్నారు. మరికొందరు మాత్రం రియల్ టైమ్ ట్రైన్ ట్రాకింగ్ యాప్ లను ఉపయోగించి స్టేషన్ కు వచ్చే సమయాన్ని సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.
A passenger at Kalyan Junction in Mumbai was fined for travelling without a valid platform ticket after his train was delayed by several hours, triggering a debate over railway rules and passenger inconvenience.
According to details, the man purchased a two-hour platform ticket… pic.twitter.com/mJ48x5f2CZ
— Hate Detector 🔍 (@HateDetectors) June 11, 2026
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!