ఉన్నత విద్యా వేదికలైన యూనివర్సిటీలను ఇంకా ర్యాగింగ్ బూతం వెంటాడుతూనే ఉంది.. వర్సిటీల్లో, కాలేజీల్లో, హాస్టళ్లలో ర్యాగింగ్ పై నిషేధాన్ని విధించినా కొన్ని చోట్ల ఇంకా ర్యాగింగ్ కొనసాగడం ఆందోళన కలిగించే విషయం.. తాజాగా, సోషల్ మీడియా వేదికగా జేఎన్టీయూ విజయనగరం క్యాంపస్ విద్యార్థి తన గోడు వెల్లబోసుకున్నారు.. Read Also: కొత్త ఒక వింత .. ఈ ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లికి ఎంట్రీ..! నా పేరు శ్రీనివాస్.. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. […]
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అని ఊరికే అన్నారా..? ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యూత్.. తమ పెళ్లి విషయంలోనూ.. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్ జిల్లా, ఫర్సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ వారి పెళ్లి సందర్భంగా.. వెడ్డింగ్ కార్డు రూపొందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. Read Also: భారీగా […]
ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో భారత్‌పై విరుచుకుపడింది కరోనా మహమ్మారి.. అయితే, ఇప్పుడు మళ్లీ భారీగా కేసులు తగ్గుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒకేరోజు 11,56,363 శాంపిల్స్ పరీక్షించగా.. 83,876 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 895 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. మరోవైపు ఇదే సమయంలో 1,99, […]
ఉత్తర కొరియా చీఫ్ కిమ్ ఏ చేసినా సంచలనంగా మారుతుంది.. వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో ఉండే కిమ్.. ఎన్నో ఆంక్షలు పెట్టినా వెనక్కిమాత్రం తగ్గిన సందర్భాలు ఉండవు.. ఇప్పటికే అణ్వాయుధ క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యం అమెరాకుకు సైతం సవాల్ విసిరిన కిమ్.. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఓ స్టెప్ వెనక్కి వేసినట్టే కనిపించారు.. కానీ, మళ్లీ ఆ దేశం అణ్వాయుధ క్షిపణి పరీక్షా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి నిపుణులు ఒక తన […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్లే కాదు.. కొందరు సామాన్యులు కూడా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోతున్నారు.. చిన్నా వీడియాలో వారి జీవితాలనే మార్చేసిన ఘటనలు ఎన్నో.. సోషల్ మీడియాలో ఒకే వీడియోతో సంచలనం సృష్టించిన గద్వాల రెడ్డి బిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి… ఆదివారం మృతిచెందడం తీవ్ర విషాదంగా మారింది.. ‘నువ్ ఎవనివో నాకు తెల్వదు… మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డా… నేను గద్వాల రెడ్డి బిడ్డ..’ అంటూ తెలిసితెలియక చేసిన ఓ వీడియో సోషల్ […]
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్షా సమావేశానికి సిద్ధం అవుతోంది.. రేపటి నుంచి 10వ తేదీ వరకు ఈ కీలక సమావేశం జరగబోతోంది.. అయితే, ఇదే సమయంలో.. వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది.. కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేస్తోంది.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ద్రవ్యోల్బణం ఆర్బీఐ […]
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.. ఓ స్థాయిలో రోజువారి కేసులు మూడు లక్షలను కూడా దాటాయి.. దీంతో.. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలియి.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి.. రోజువారి కేసులు లక్షకు చేరువచ్చాయి.. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను ఎత్తివేసింది.. ఇవాళ్టి నుంచి ఉద్యోగులందరూ యథావిధిగా ఆఫీసులకు […]