FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
- ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభ మ్యాచ్
- మెక్సికో 2-0తో దక్షిణాఫ్రికాపై విజయం.
- 9వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ టోర్నమెంట్ తొలి గోల్ నమోదు
- 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ రెండో గోల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్య దేశమైన మెక్సికో మంచి ప్రారంభాన్ని అందుకుంది. మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచే మెక్సికో పూర్తి ఆధిపత్యం చూపించింది. మ్యాచ్ మొదలైన తొమ్మిదో నిమిషంలోనే దక్షిణాఫ్రికా గోల్‌కీపర్ విలియమ్స్ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న జూలియన్ క్వినోనెస్ టోర్నమెంట్లో మొదటి గోల్ నమోదు చేశాడు. దీంతో మెక్సికోకు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత కూడా ఎల్ ట్రై జట్టు వరుసగా ఎటాక్ చేయడంతో ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించింది. బంతిపై నియంత్రణతో పాటు పలు అవకాశాలు సృష్టిస్తూ తొలి అర్ధభాగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది.
రెండో అర్ధభాగంలో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 54వ నిమిషంలో దక్షిణాఫ్రికా ఆటగాడు యాయా సిథోలే, బ్రియాన్ గుటియెరెజ్పై చేసిన ఫౌల్ కారణంగా రెడ్ కార్డు కారణంగా మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో దక్షిణాఫ్రికా 10 మంది ఆటగాళ్లతోనే కొనసాగాల్సి వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మెక్సికో 67వ నిమిషంలో మరో గోల్ సాధించింది. జూలియన్ క్వినోనెస్ అందించిన పాస్ ను రౌల్ జిమెనెజ్ గోల్ గా మర్చి జట్టుకు 2-0 ఆధిక్యం అందించాడు. ఈ గోల్‌తో మెక్సికో విజయం దాదాపు ఖాయమైంది.
Also Read
- Airtel నుంచి 'Buy 1 Get 1' ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
- Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
- Diwali Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి నష్టం..!
- Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
దీనితో కష్టాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు మరో భారీ షాక్ తగిలింది. థెంబా జ్వానే, రోబర్టో అల్వరాడోలు ముఖంపై చేయి వేయడంతో VAR సమీక్ష తర్వాత వారికీ రెడ్ కార్డు చూపించారు. దీంతో జట్టు కేవలం 9 మంది ఆటగాళ్లతో మిగిలిపోయింది. అయితే మ్యాచ్ చివరి దశలో మెక్సికోకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా ఆటగాడు ఖులిసో ముడౌపై చేసిన ఛాలెంజ్ కు మెక్సికో కెప్టెన్ సీజర్ మోంటెస్ కు కూడా రెడ్ కార్డు విధించారు. దీంతో మ్యాచ్‌లో మొత్తం మూడు రెడ్ కార్డులు నమోదయ్యాయి.
అయినప్పటికీ మెక్సికో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2-0 తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. స్వదేశీ అభిమానుల మద్దతుతో ప్రపంచకప్‌ను గెలుపుతో ప్రారంభించిన మెక్సికో, టైటిల్ వేటలో తమ ఆశయాలను బలంగా చాటుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా క్రమశిక్షణ లోపం, అవకాశాలను వినియోగించుకోలేకపోవడం వల్ల ఓటమితో టోర్నీని మొదలు పెట్టింది.
Co-hosts off to a winning start! 🇲🇽#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 11, 2026
తాజావార్తలు
-
Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
ట్రెండింగ్
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..