FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026: 2026 ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దక్షిణ కొరియా (South Korea) అద్భుత ఆటతీరుతో చెక్ రిపబ్లిక్ (czechia)పై 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదట్లో వెనుకబడినప్పటికీ.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకున్న కొరియా జట్టు చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో దక్షిణ కొరియా 16 ఏళ్ల తర్వాత FIFA ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఇరు జట్లు జాగ్రత్తగా ఆచితూచి ఆడాయి. అటాకింగ్ కంటే డిఫన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. మైదానంలో చాలా క్రమశిక్షణతో ఆడాయి. దక్షిణ కొరియా బంతిపై ఎక్కువసేపు నియంత్రణ సాధించినప్పటికీ.. చెక్ రిపబ్లిక్ డిఫ్ఫెండింగ్ పటిష్టంగా ఉండడంతో గోల్స్ అవకాశాలు పెద్దగా లభించలేదు. ముఖ్యంగా మధ్యభాగంలో లీ కాంగ్-ఇన్‌కు అవకాశాలు ఇవ్వకుండా చెక్ రిపబ్లిక్ సమర్థంగా అడ్డుకుంది.
Also Read
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
మరోవైపు.. చెక్ రిపబ్లిక్ కౌంటర్ అటాక్స్‌తో ప్రమాదకరంగా కనిపించింది. స్టార్ ఫార్వర్డ్ ప్యాట్రిక్ షిక్ చుట్టూ అత్తచ్కింగ్ చేస్తున్నా.. కొరియా సెంటర్ బ్యాక్స్ సమర్థవంతంగా డిఫెండ్ చేసి ప్రత్యర్థికి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ నమోదుకాలేదు. ఇక రెండో అర్ధభాగంలో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 59వ నిమిషంలో చెక్ రిపబ్లిక్ కార్నర్ కిక్ ను సద్వినియోగం చేసుకుని తొలి గోల్ గా మలిచింది. లాడిస్లావ్ క్రేజ్చి అద్భుత హెడ్డర్‌తో బంతిని నెట్లోకి పంపి జట్టుకు ఆధిక్యం అందించాడు. అయితే ఆ తర్వాత దక్షిణ కొరియా అసలైన ఆటను ఆడి అవకాశాలను సృష్టించుకుంది.
గోల్ వెనుకబడిన తర్వాత దక్షిణ కొరియా ఆటలో వేగాన్ని పెంచింది. నెమ్మదిగా బంతిని తిప్పడం మానేసి ప్రత్యర్థి మిడ్‌ఫీల్డ్, డిఫెన్స్ మధ్య ఖాళీలను లక్ష్యంగా చేసుకుంది. హ్వాంగ్ ఇన్-బియోమ్ మరింత దూకుడుగా ఆడుతూ చెక్ రిపబ్లిక్ డిఫెన్స్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ వ్యూహాత్మక మార్పుతో దక్షిణ కొరియా పుంజుకుంది. దీనితో 67వ నిమిషంలో గోల్ వచ్చింది. బాక్స్ అంచున జరిగిన పాస్ లతో ఏర్పడిన అవకాశాన్ని హ్వాంగ్ ఇన్-బియోమ్ గోల్ గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత కొరియా అటాకింగ్ ను మరింత పెంచింది. వింగర్స్, ఫార్వర్డ్స్ మధ్య షార్ప్ ఆటతో చెక్ రిపబ్లిక్ రక్షణను గందరగోళానికి గురిచేశాయి. ఇంకేముంది ఈ దెబ్బతో మ్యాచ్ 80వ నిమిషంలో నిర్ణయాత్మక మలుపు తిరిగింది. వేగవంతమైన కౌంటర్ అటాక్‌లో చెక్ రిపబ్లిక్ ఎడమ వైపు డిఫెండింగ్ లో ఏర్పడిన ఖాళీని దక్షిణ కొరియా సమర్థంగా వినియోగించుకుంది. ప్రత్యామ్నాయ ఆటగాడు ఓ హ్యోన్-గ్యు లో షాట్‌తో గోల్ సాధించి జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు.
ఆ తర్వాత చెక్ రిపబ్లిక్ సమీకరణ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది. పొడవాటి పాస్‌లు, సెట్పీస్ ల ద్వారా ఒత్తిడి పెంచినా దక్షిణ కొరియా రక్షణ గోడలా నిలిచింది. క్రమబద్ధమైన డిఫెన్సివ్ బ్లాక్‌తో ప్రత్యర్థి దాడులను సమర్థంగా అడ్డుకుని చివరి విజిల్ వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ మ్యాచ్ లో దక్షిణ కొరియా చేసిన వ్యూహాత్మక మార్పులు, వేగవంతమైన ట్రాన్సిషన్ ఆట, కీలక సమయంలో చూపిన సమన్వయం విజయానికి ప్రధానంగా నిలిచాయి.
Difference maker 🪄#FIFAWorldCup pic.twitter.com/EMYkZCisGl
— FIFA World Cup (@FIFAWorldCup) June 12, 2026
తాజావార్తలు
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?