ఇల్లు అలకగానే పండగ కాదు.. రేపు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో మీరే ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ ఆలోచనా సరళి కుంచిత పోకడలు పెరిగిపోతున్నాయి. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. కానీ, పులివెందుల జడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టాడు అని దుయ్యబట్టారు..
పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు..
నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్.. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ ని ప్రారంభిస్తున్నాం.. యువత - పరిశ్రమలను అనుసంధానించేలా నైపుణ్యం పోర్టల్ పని చేస్తుందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుపై హాట్ కామెంట్లు చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్నారు.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారు..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఓవైపు విచారణలు.. మరోవైపు.. కోర్టులో పిటిషన్లు.. ఇంకో వైపు.. పిటిషన్లపై విచారణ ఇలా.. ఈ రోజు కీలకంగా మారింది..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తుంది.. ఇక, మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది..
మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.. మంత్రులు ఏడాది కాలంలో మెరుగ్గా పనిచేశారు.. ఇక నుంచి పరిపాలనలో దూకుడు పెంచాలని సూచించారు.. తప్పుడు వార్తలు నిజం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది.. వైసీపీ నేతల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు..
కేబినెట్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రుల తో ప్రస్తావించారు.. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తు ఆధారంగా అరెస్టులు ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, లిక్కర్ కేసు విషయంలో మంత్రులు ఆచి తూచి స్పందించాలన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు..