JC Prabhakar Reddy: ఇదే లాస్ట్ దీపావళి అంటే మేం చూస్తూ ఊరుకోవాలా..? మేం మొదలు పెడితే తట్టుకోలేరు.. జేసీ వార్నింగ్..
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ వార్నింగ్..
- కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు..
- ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..?..
- మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు మంచి వ్యక్తి.. ఆయన అడ్డుపడుతున్నాడు కాబట్టి.. మీరు ఇలా ఉన్నారంటూ హెచ్చరించారు.. వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటున్నాడు.. అంటే.. ఇదే లాస్ట్ దీపావళి అంటే మేము చూస్తూ ఊరుకోవాలా..? మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.. మాట్లాడేటప్పుడు ఒక సారి ఆలోచించి మాట్లాడండి అని హితవు చెప్పారు.. నీకు భవిష్యత్తు చాలా వుంది దానిని నాశనం చేసుకోకు అని సూచించారు.. ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మంచి వాడు కాబట్టే.. మీరు ఇలా మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు జేసీ.
Read Also: Tamil Nadu Rain: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేను మూడేళ్లే ఉంటానని పెద్దారెడ్డి చెబుతున్నాడు.. దేవుని ఆశిస్సులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్న ఆయన.. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిన్నవాడు.. ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి.. మళ్లీ అవకాశం ఉండొచ్చు.. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడని పేర్కొన్నారు.. మరోవైపు, అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఏమైంది..? దానిపై గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.. సెంట్రల్ రైలు సర్వీసులు ప్రైవేటీకరణ చేయలేదా..? ప్రభుత్వం ఎన్నో సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదా? అని ప్రశ్నించారు.. అసలు, వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారు..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు జేసీ.. చివరకు నేను కూడా తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు చేయించుకుంటున్నానని తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి..
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!