తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది.. మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగగా.. స్థానిక సమస్యలపై మండల స్థాయి టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. శాంతిపురం మండలం, గుడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుయువత కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు..
Read Also: Breaking: మరోసారి ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..
ఇక, కేసులకు బయపడాల్సిన పనిలేదు.. ప్రభుత్వ అక్రమాలు ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు చంద్రబాబు… మరోవైపు, కుప్పంలోనే సొంతిల్లు కడుతున్నా… ప్రతి 3 నెలలకు ఓ సారి కుప్పంలో పర్యటిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.. ఈ సారి కుప్పంలో లక్ష మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలు, నాయకులను ఆదేశించిన చంద్రబాబు… కాగా, పెరిగిన ధరలను నిరసిస్తూ.. బాదుడే బాదుడే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీడీపీ.. అందులో భాగంగా.. పలు జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వ విధానాలను, పెరిగిన ధరల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు చంద్రబాబు.