ATA Conference: ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు అమెరికా ముస్తాబవుతోంది.. జులై 1-3 తేదీల్లో జరగనున్న ఆటా మహాసభలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు.. ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో ఆటా 17వ మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వహకులు.. ఇక, ఈ మహాసభల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2వ తేదీన ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్లో కవిత అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు.. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఏర్పాట్ల కోసం ఏకంగా 80 కమిటీలుగా ఏర్పడి శ్రమిస్తున్నారు ఆటా ప్రతినిధులు.
Also Read
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!