ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆ దిశగా దూకుడు పెం చుతోంది. ఈనెల 20వరకు వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు పోరు యాత్రకు సిద్ధం అయింది. 500 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది బీజేపీ వాదన. ప్రతిపాదిత పనులు చేపడితే ఎనిమిది లక్షల ఎకరాలకు నీరందుతుందని […]
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేసింది ఎన్టీఏ… ఏప్రిల్‌లో జరగాల్సిన మొదటి విడత జేఈఈ మెయిన్… జూన్‌కి వాయిదా వేశారు.. జూన్ 20వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. ఇక, మేలో జరగాల్సిన రెండో విడత పరీక్షలు జులై 21వ తేదీ నుండి 30వ తేదీ […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో ఈ రోజు కీలక ఘట్టం జరగబోతోంది. మంత్రి మండలి రద్దు కానుంది.. సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో చివరి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశం ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరిది అవుతుంది. కొత్తపేటకు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తుంది. సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు సంకేతాలు అందటంతో […]
* నేడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సర్వ ప్రతినిధి సభ అత్యవసర భేటీ.. ఐరాస హెచ్ఆర్సీ నుంచి రష్యాను సస్పెండ్ చేసే ప్రతిపాదనపై నేడు ఓటింగ్ * నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ, సమావేశం తర్వాత రాజీనామా చేయనున్న ప్రస్తుత మంత్రులు * కొరియా ఓపెన్ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో సింధు, కిదాంబి శ్రీకాంత్.. నేడు ప్రిక్వార్టర్స్‌లో ఓహోరి (జపాన్)తో తలపడనున్న సింధు, నేడు ప్రిక్వార్టర్స్‌లో మిషా జిల్టర్మన్ […]
పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడి జాతీయ అసెంబ్లీని… రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ చేస్తోన్న ప్రయత్నాలు సాఫీగా సాగేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా.. వచ్చే మూడు నెలల్లో ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లుగా వచ్చే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమేనని పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ చెబుతోంది. ముఖ్యంగా న్యాయపరమైన, రాజ్యాంగ […]
ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్.. థర్డ్ వేవ్… వరుసగా మూడు కరోనా వేవ్‌లను చేశాం.. ఈ సమయంలో.. ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి.. కొన్ని ప్రమాదకరంగా మారగా.. కొన్ని అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుతోన్న తరుణంలో… కొత్తరకం వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం ఎక్స్ఈ వేరియంట్ భారత్‌లోనూ వెలుగుచూసింది. తొలి కేసు ముంబైలో నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా కప్పా […]
రాస్తారోకోలు, ధర్నాలు కొత్త కాదు.. ఈ మధ్య.. కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో పోటీపోటీ ఆందోళను నడుస్తున్నాయి.. అయితే, కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగంగా తెలంగాణలో నేడు చేపట్టిన, రేపు చేపట్టబోతున్న టీఆర్ఎస్ రాస్తారోకో, ధర్నాలపై హైకోర్టులో విచారణ జరిగింది… అనుమతి లేకుండా టీఆర్ఎస్ ఆందోళన చేస్తోందంటూ కాకతీయ లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ పిటిషన్ దాఖలైంది.. దానిపై విచారణ చేపట్టింది హైకోర్టు.. ధర్నాలతో ప్రజా రవాణాకు ఆటంకం కలుగుతోందని పిటిషన్ పేర్కొన్నారు… […]
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల పనివేళలను కుదిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ.. ఇప్పుడు మళ్లీ పెంచింది.. రాష్ట్రంలో ఒక్కపూట బడులు ప్రారంభం అయినప్పట్టి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించారు.. అయితే.. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో వారం రోజుల పాటు అంటే.. గత గురువారం నుంచి ఇవాళ్టి (ఏప్రిల్ 6వ తేదీ) వరకు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే బడులను […]
వైద్యులకు యూజీసీ నిబంధనల మేరకు పీఆర్సీని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు సీఎం కేసీఆర్.. వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచామన ఆయన.. వైద్యశాఖలో 21,073 పోస్టులను కొత్తగా మంజూరు చేశామన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేస్తున్నాం.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.. వాటికి నిర్మాణ పనులు చేస్తున్నాం అన్నారు.. ఇక, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ […]