తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకపుట్టిస్తున్నాయి.. వైసీపీ నేతలు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే.. టీడీపీ నేతలు మాత్రం నిజమే అంటున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు కేటీఆర్ చెప్పారన్నారు.. అయితే, ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి వైఎస్ జగన్ -కేసీఆర్‌ల ఉమ్మడి అజెండాగా ఆరోపించారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా […]
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, కరెంట్ లాంటి సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి.. దీంతో, కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ మంత్రలు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన.. చాలా సున్నితమైన అంశం, కేటీఆర్ చెప్పినట్టు అయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? అని ప్రశ్నించారు. ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు.. నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా.. అక్కడ కరెంటే లేదు, నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని […]
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ప్రశ్నం లీక్ వార్తలు కలకలం సృష్టించాయి.. అయితే, ఎక్కడా టెన్త్ పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఉదయం 9:30 గంటల కంటే ముందుగా పేపర్ బయటకొస్తే లీక్‌గా భావిస్తారని, నంద్యాలలో పేపర్ లీక్ అంటూ కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. కుట్రకు పాల్పడిన వారిపైనా, టీచర్లపైనా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ […]
టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది.. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.. భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ మూలంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెబుతున్నారు. Read Also: KTR : కేంద్రమంత్రిపై ట్విట్టస్త్రాలు సంధించిన కేటీఆర్.. నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి […]
గన్ కంటే ముందే దూసుకువస్తానన్న జగన్ ఎక్కడా.. ? అంటూ ప్రశ్నించారు నారా లోకేష్.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లిన ఆయన.. దుండగుల అఘాయిత్యానికి బలైన బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.. అయితే, లోకేష్ పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ దశలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్లు రువ్వుకున్నాయి.. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు.. ఇక, బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చట్టాలంటే […]
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని రాజా రాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లు యజమానులుపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు.. హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ. 62 కోట్లు (రూ.61.71 కోట్లు) రుణం తీసుకుని ఎగవేసినట్టు అభియోగాలు మోపారు.. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది సీబీఐ.. రైస్ మిల్లు యజమానులైన కందా ప్రసన్న కుమార్ రెడ్డి, కందా ప్రతిమ, కందా పద్మనాభ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు […]
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందర్నీ శోక సంద్రంలో ముంచెత్తింది.. ఎంతో భవిష్యత్ ఉన్న నేత.. మరణాన్ని అటు కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక, ఆయన వారసుడిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి.. అన్న వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్నా.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇవాళ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, […]
ముందస్తు ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసిన ఆయన.. 2024లోనే ఎన్నికలు ఉంటాయన్నారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి… ఈ ఏడాది చివరిలోగా దశల వారీగా 2 లక్షల 16 వేల టిడ్కో ఇల్లులు లబ్ధిదారులకు అందిస్తాం అన్నారు. ఈ ఏడాది మే నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేస్తాం […]