కొందరి ప్రతిభకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. కుర్రాడికి ఆట పట్ల ఉన్న ప్రేమతో పాటు.. అతని ప్రతిభ ఏ పాటితే తెలియజేసేలా ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.. బౌలింగ్ సాధన చేస్తున్న ఆ కుర్రాడు.. తన బౌలింగ్‌తో ఎంతోమంది హృదయాలను బౌల్డ్ చేశాడు.. అందులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.. రాజస్థాన్ రాజ్‌సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ లో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.. క్రికెట్ ప్రాక్టీస్ అనగానే గ్రౌండ్‌కు వెళ్లి.. నెట్ మధ్యలో చేస్తున్నాడు అనుకోకండి.. ఎందుకంటే.. ఆ కుర్రాడు పొలం దగ్గర.. అది కూడా చేపలు పట్టే నెట్‌ను కట్టి.. అందులో ప్రాక్టీస్ చేస్తున్నాడు.. ఆ వీడియోకు రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్ వీడియోను దీపక్ శర్మ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఆ వీడియో చూసి ముగ్ధుడైన రాహుల్.. రిట్వీట్ చేసి.. అతడి కుర్రాడి కలలు నిజం చేసేందుకు సాయం అందించాలంటూ.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు ట్యాగ్ చేశారు.
ఇక, ఆ వీడియోను రిట్వీట్ చేస్తూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.. దేశంలోని నలుమూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది.. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత అని పేర్కొన్న ఆయన.. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని సీఎం అశోక్ గెహ్లాట్‌ను కోరుతున్నాను… అని ట్వీట్ చేశారు.. ఇక, రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్పందించిన అశోక్ గెహ్లాట్.. తప్పకుండా.. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లి అవసరమైన సాయం చేస్తాం అంటూ జవాబు ఇచ్చారు.. మొత్తంగా ఆ కుర్రాడి బౌలింగ్ వీడియో ఇప్పుడు నెట్లింట్లో వైరల్‌గా మారిపోయింది.. బుడ్డోడి ప్రతిభపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
हमारे देश के कोने-कोने में अद्भुत प्रतिभा छिपी हुई है, जिसे पहचानना और बढ़ावा देना हमारा कर्तव्य है।@ashokgehlot51 जी से मेरा निवेदन है, इस बच्चे का सपना साकार करने के लिए कृपया उसकी सहायता करें। https://t.co/vlEKd8UkmS
— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2022