గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు… ఇక, సుమారు గంట పాటు గవర్నర్-సీఎం మధ్య చర్చలు జరిగాయి.. సమకాలిన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా చర్చించారు.. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన.. ప్రజలకు మరింత చేరువైనట్టు గవర్నర్ కు వివరించారు సీఎం జగన్.. నూతన జిల్లాల్లో […]
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఇక, పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. అయితే, 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. Read […]
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. మరింత అప్రమత్తం అయ్యింది పాఠశాల విద్యాశాఖ.. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్ధులు, ఎగ్జామినర్లు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. పరీక్షల విధులతో సంబంధం లేని సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాలకు అనుమతించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా […]
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి.. పలు రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి.. రేపు 14 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని సంచలనం.. గెలిపించే బాధ్యత వాలంటీర్లదే..! తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల విషయానికి వస్తే.. […]
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారన్న ఆయన.. వైసీపీ పార్టీ నాయకులు చెప్పిన వారిని వాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ఇక, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే దానికి ముఖ్య కారకులు వాలంటీర్లే అన్నారు బాలినేని.. అంతేకాదు.. గడప గడపకే నేను తిరుగుతాను.. కానీ, నన్ను […]
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది… ఐఏఎస్ అధికారులకు ఈమధ్యే విధించిన సేవా శిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు… కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకుగాను కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు సేవా శిక్షను హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన విషయం విదితమే కాగా.. ఈ శిక్షను డివిజనల్ బెంచ్‌లో గత వారం సవాల్ చేశారు.. అందులోని ఇద్దరు ఐఏఎస్ అధికారులు… దీంతో, సేవాశిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది […]
అసలే కరోనా సమయం.. ఏ కొత్త వైరస్ వెలుగు చూసినా.. అది కరోనా వేరియెంటేనా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, కేరళలో మరోసారి షిగెల్లా కేసు బయటపడింది.. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు అధికారులు.. ఏప్రిల్27వ తేదీన కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎవరికీ వ్యాపించిన దాఖలాలు లేవంటున్నారు అధికారులు.. ఈ నెల 20వ తేదీన చిన్నారిలో షిగెల్లా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలనడంతో స్థానికులు ఆందోళనకు […]
2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 ఎందుకు గెలవకూడదు అని ప్రశ్నించారు.. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తోంది… సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పార్టీకి 175 స్థానాలు ఎలా వస్తాయి..? అని […]
ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటాన్స్… తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి.. గుజరాత్ ముందు 196 పరుగుల టార్గెట్ పెట్టింది.. ఇక, ఈ మ్యాచ్ చివరి ఓవర్లో టర్న్ తిరిగింది.. ఒక ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు గుజరాత్ బ్యాట్మెన్స్… చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 199 పరుగులు […]