Monkeypox Vaccine: కలవరపెడుతోన్న మంకీపాక్స్.. వ్యాక్సిన్‌పై భారత్ ఫోకస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు కరోనా మహమ్మారి భయం వెంటాడుతూనే ఉండగా.. ఇప్పుడు మంకీపాక్స్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 16వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో.. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌తో చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధం అవుతోంది.. మంకీపాక్స్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఫార్మా కంపెనీలు కేంద్రంతో చర్చలు ప్రారంభించాయి.. వ్యాక్సిన్ తయారీ కోసం ఔషధ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ ప్రకటించారు.. భవిష్యత్తులో మంకీపాక్స్ వ్యాక్సిన్ కోసం అవసరమైతే ప్రైవేట్ వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తామంటోంది నీతి ఆయోగ్..
Read Also: Good News Soon to Employees: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..!
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
“మంకీపాక్స్‌కి ప్రత్యేకంగా అలాంటి వ్యాక్సిన్ లేదు.. ఇంతకుముందు స్మాల్ పాక్స్‌కి టీకా ఉంది. కాబట్టి, మేం ఆ అంశాన్ని పరిశీలిస్తున్నాం.. ఏదో ఒక సమయంలో వ్యాక్సిన్ అవసరమైతే, తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాం.. దాని కోసం ప్రయత్నాలు ప్రారంభించామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు.. అయితే, అధికారిక సమాచారం ప్రకారం.. రెండు భారతీయ ఫార్మా కంపెనీలు మంకీపాక్స్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేయడం కోసం ప్రభుత్వంతో చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు, వ్యాక్సిన్ పంపిణీ అనివార్యమైన తరుణంలో దీనిని దిగుమతి చేసుకునేందుకు డెన్మార్క్ కు చెందిన సంస్థతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్లు సంస్థ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.. మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం స్మాల్ పాక్స్ ను ఎదుర్కొనే టీకానే డెన్మార్క్ కు చెందిన బవారియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసిందని.. ఇది వివిధ పేర్లతో అమెరికా, యూరప్ దేశాల మార్కెట్ లలో అందుబాటులోకి తెచ్చాయని.. మంకీపాక్స్ కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేకపోయినా.. స్మాల్ పాక్స్ కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ నే మంకీపాక్స్ నిరోధానికి ఆయా దేశాలు అనుమతించినట్టు చెబుతున్నారు.
ఇక, కోతుల ద్వారా మంకీపాక్స్ వ్యాప్తిపై నిఘా పెట్టినట్టు డాక్టర్ పాల్ తెలిపారు.. అయితే, మంకీపాక్స్‌ను ప్రజలు దాచిపెట్టి చికిత్స చేసుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు.. విదేశీ ప్రయాణ చరిత్ర లేని వ్యక్తులలో మంకీపాక్స్‌ను గుర్తించడంపై అడిగినప్పుడు, ఈ వ్యాధి యొక్క పూర్తి ఎపిడెమియాలజీ ఇంకా అధ్యయనం చేయబడుతుందని డాక్టర్ పాల్ చెప్పారు. మేం ఇప్పటికీ ప్రపంచ స్థాయిలో వ్యాధి యొక్క పూర్తి ఎపిడెమియాలజీని అర్థం చేసుకుంటున్నాం.. కానీ, మన దేశంలో కొన్ని కేసులను మాత్రమే చూశాం.. కాబట్టి, వ్యాధి ఎలా వ్యాపిస్తుందనే దానిపై పూర్తిస్థాయిలో వెల్లడించడం సరైంది కాదన్నారు. గత వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ వైరస్ సంక్రమణకు సంబంధించిన నాలుగు కేసులను ఇప్పటికే భారత్‌లో గుర్తించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!