క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ చుట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది.. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ చికోటి, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు జరిగాయి.. తెలంగాణలోని సైదాబాద్, బోయిన్‌పల్లి, కడ్తాల్‌లో ఈడీ సోదాలు జరిగాయి. సుమారు 20 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు అధికారులు.. నేపాల్‌లో లీగల్‌గా క్యాసినో నిర్వహించినట్టు ఈడీ అధికారులకు ప్రవీణ్ తెలిపాడు. దీంతో ప్రవీణ్ ల్యాప్‌టాప్‌లో అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.. పలువురు వీఐపీలతో పాటు సినిమా పరిశ్రమకు సబంధించినవారికి కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే, చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. గత సంక్రాంతి పండుగ సందర్బంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో గుడివాడలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించి ప్రజలను నిలువు దోపిడి చేశారన్న ఆయన.. చికోటి ప్రవీణ్ ఇప్పడు నేపాల్ లో నిర్వహించిన క్యాసినోలో వేల కోట్ల హవాలా ధనం చేతులు మారినట్లు గుర్తించి ఈడీ సోదాలు నిర్వహించిందని.. నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారు. ఇందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని అంటున్నారని పేర్కొన్నారు.
Read Also: Rain Alert : హైదరాబాద్‌వాసులు అలర్ట్.. నేడు భారీ వర్ష సూచన..
ఇక, ఒక్కక్కరికి దగ్గర చికోటి ప్రవీణ్ రూ. 3 లక్షలు వసూలు చేసి మందు, విందు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని విమర్శించారు వర్ల రామయ్య.. క్యాసినో క్రీడతో వైసీపీ నేతలు బ్లాక్ మనినీ వైట్ మనీగా మార్చుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. గుడివాడ క్యాసినో కేరళ నుంచి వచ్చిన పెద్దలు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారని.. దీనిపై కేరళ ప్రభుత్వం స్పందించినా.. జగన్ మాత్రం కనీసం విచారణ జరపలేదని.. పైగా టీడీపీ నిజనిర్దారణ కమిటీపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు.. చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు సంబంధం ఉంది. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు.. క్యాసినో పేరుతో ఎన్నో కుటుంబాలను నాశనం చేసిన పాపం ఊరికే పోదని.. ఇది రావణ కాష్టంలా రగులుతుందన్నారు. దీనికి బాద్యులైన వైసీపీ నేతలకు, పోలీసులకు ముసళ్ల పండుగ ముందుందని హెచ్చరించారు.. ఈడీ అందరి భాగోతం బయటపెడుతుంది.. గుడివాడ క్యాసినో ద్వారా వచ్చిన విపరీతమైన డబ్బుతో హైదరాబాద్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు వర్ల రామయ్య.