కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా వ్యవసాయ మోటార్లకు కూడా విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారు.. అయితే, కొన్ని రాష్ట్రాలను దీనిని వ్యతిరేకిస్తున్నా.. మరికొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విద్యుత్ రంగం పై సమీక్ష నిర్వహించిన ఆయన.. వ్యవసాయ మోటార్లకు మీటర్లపై రైతులకు లేఖలు రాయాలని సంబంధిత అధికారులకు సూచించారు.. ఆ లేఖల్లో వ్యవసాయ మెటార్లకు మీటర్లు పెట్టడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు పేర్కొనాలని ఆదేశించారు.. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించాలని సూచించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం
ఇప్పటికే శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేశాం.. అక్కడ ఎలా విజయవంతం అయ్యిందో రైతులకు వివరించాలని పేర్కొన్నారు సీఎం జగన్.. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ శ్రీకాకుళంలో ఆదా అయిన విషయాన్ని రైతుల దృష్టికి తీసుకెళ్లాలన్న ఆయన… మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవనే విషయం కూడా తెలపాలన్నారు.. ఎంత కరెంటు కాలుతుందో మాత్రమే తెలుస్తుంది.. నాణ్యంగా విద్యుత్ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాలి.. వ్యవసాయ పంపు సెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలని.. ట్రాన్స్‌ఫార్మర్ పాడైతే వెంటనే రిప్లేస్ చేయాలని ఆదేశించారు. కాగా, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.. ఈ విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నా గొంతులో ప్రాణం ఉండగా.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.