రాజ్యసభ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల దరఖాస్తు ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.మరోవైపు రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. Read Also: […]
విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం చిత్రం ‘ఖుషి’.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూట్లో చోటు చేసుకున్న ఘటనతో విజయ్ దేవరకొండతో పాటు సమంతకు కూడా గాయాలైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని.. ఇద్దరు లిడ్డర్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడిపే సీన్ సమయంలో.. వాహనం నీటిలో పడటంతో ఇద్దరూ గాయపపడం.. వెంటనే చిత్ర యూనిట్ […]
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయాన్ని లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లో జోరుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతోందన్న ఆయన.. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తున్నారని.. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలని లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల […]
సింహం సైలెంట్‌గా ఉందని దాని ముందు కుప్పి గంతులు వేయొద్దు.. దాని కోపం వస్తే ఏమవుతుందో అందరికి తెలుసు.. బోనులో పెట్టినా సింహం మాత్రం పిల్లిగా మారిపోదుగా… అయితే, జూలో ఉన్న సింహాన్ని ఆటపట్టించేవిధంగా తిక్కవేశాలు వేసిన ఓ వ్యక్తికి.. చివరకు చుక్కలు చూపించింది ఆ సింహం.. జమైకా.. సెయింట్ఎలిజబెత్లోని ఓ జూలో జరిగింది ఈ ఘటన.. జూలోనే పనిచేసే ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించగా.. కోపంతో ఆ సింహం గర్జించింది.. ఆయినా […]
దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా అరుదైన సమావేశం జరిగింది.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా మీట్ అయ్యారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన నేతలు.. ఇలా భేటీ అయ్యారు. Read Also: Gannavaram Politics: గన్నవరం టికెట్ ఆయనకే.. అధిష్టానం క్లారిటీ..! మరోవైపు ఇప్పటికే పలు దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధి బృందాలతో సమావేశాలు నిర్వహించారు ఇద్దరు […]
గన్నవరం పాలిటిక్స్ హీట్ పెంచాయి.. నియోజకవర్గంలో ఉన్న విభేదాలు చివరకు అధిష్టానం వరకు చేరాయి.. అయితే, ఇప్పుడు గన్నవరం టికెట్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చేసింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే వచ్చే ఎన్నికల్లో ఆ సీటు కేటాయిస్తారని తెలుస్తోంది.. టీడీపీలో పరమ విధేయుడిగా ఉన్న వంశీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూడడం.. ఆ సమయంలో తాను మాత్రం గన్నవరం నుంచి మరోసారి విజయం సాధించడంతో టీడీపీకి బైబై చెప్పేశారు.. సందర్భం దొరికితే […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, వైశాఖమాసం, కృష్ణపట్నం, మంగళవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్‌కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్అవుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కూడా రేపే విడుదల చేయనుంది […]
ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి […]
ప్రేమించడం గొప్పకాదు.. కలిసి బతకడం గొప్ప అని చెబుతారు.. కానీ, కొన్ని ఘటనలు చూస్తుంటే.. కొందరు ప్రేమికులు ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకుంటుంటే.. కొందరు నా ప్రేమను అంగీకరించలేదని హత్య చేస్తున్నారు.. ఇక, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నవారిని కూడా వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు తీస్తున్నారు.. తాజాగా కర్ణాటకలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ఉడుపి జిల్లా బ్రహ్మవర పోలీస్‌స్టేషన్ పరిధిలో.. కారులో పెట్రోల్ పోసుకుని […]