ప్రజా ప్రతినిధులంతా ప్రజల వద్దకు వెళ్లేలా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలనుంచి ప్రజా ప్రతినిధులకు నిరసన తప్పడంలేదు, తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీశారు ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ వచ్చాక అన్నీ ఇస్తున్నాడు.. కానీ, అన్ని ధరలు పెంచాడని ఆ వృద్ధురాలు నిలదీసింది ఆమె. Read Also: Nageswara Rao: ఆంధ్రప్రదేశ్‌ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..! […]
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం తీవ్ర విధ్వంసానికి దారితీసింది.. అంబేద్కర్ పేరును ఆ జిల్లాకు జోడించడంపై ఓ వర్గం ఆందోళన చేస్తుండగా.. అంబేద్కర్ పేరును కొనసాగించాలంటూ దళితసంఘాలు నిరసనకు దిగుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చేయాలంటూ సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా విన్నపం. అంటూ […]
అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000 […]
కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో ఒక్కసారిగా అమలాపురం అట్టుడికిపోయింది.. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం సృష్టించారు ఆందోళనకారులు… మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇక, పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.. దీంతో, అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. ఆందోళనకారులను గుర్తించే పనిలో పడింది విశాల్ గున్ని […]
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన విధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటన వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా… కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన, అన్ని పార్టీలు కోరాయన్న ఆయన.. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే ఉన్నారు.. రాష్ట్రానికి విలన్ చంద్రబాబే అంటూ మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్, ఎన్టీఆర్, […]
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు జోడించడంపై పెద్ద రచ్చే జరుగుతోంది.. ఇది అమలాపురంలో విధ్వంసానికి దారి తీసింది.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పుపెట్టేవరకు వెళ్లింది.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వైసీపీకి అంబేద్కర్ పట్ల ప్రేమ ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుగా..? అని ప్రశ్నించారు. అంబేద్కర్ దేశానికి దైవం.. కోనసీమలో హింసను ఖండిస్తున్నామన్న ఆయన.. కోనసీమ ఆందోళనల్లో బీజేపీ నేతలెవ్వరూ పాల్గొనలేదన్నారు. అంబేద్కర్ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి […]
కోనసీమ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నా.. చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు.. ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.. టూవీలర్లపై వస్తున్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.. అమలాపురంలోకి ఎంట్రీ ఇచ్చే వాహనదారులు వివరాలు మొత్తం సేకరిస్తున్నారు.. ఇక, రోడ్లపైకి వచ్చే ఆందోళన చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు.. అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందన్న ఆయన.. విధ్వంస చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం […]
కోనసీమ జిల్లా పేరు వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారిపోయింది.. ఆ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.. విధ్వంసం సృష్టించింది. మరోవైపు ఇవాళ కూడా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. ఇప్పటికే అమలాపురంలో కఠిన ఆంక్షలు విధించారు. బయట ప్రాంతాల నుంచి ఎవ్వరినీ అమలాపురంలోకి రానివ్వడంలేదు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు.. ఆర్టీసీ సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇక, కోనసీమకు సీనియర్ ఐపీఎస్‌లను పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Read Also: Dowry harassment: […]
తిరుపతిలోని ముదివేడు పోలీస్‌స్టేషన్ ఎస్ఐపై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది.. రూ.10 లక్షల అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి రావాలని భార్యను వేధించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని కురబలకోట మండల ముదివేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న సుకుమార్… భార్యను గన్‌తో కాల్చ తానని బెదిరించడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. ఎస్ఐ సుకుమార్ భార్య విష్ణు ప్రియ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు […]
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.. అన్ని నెట్వర్క్ లకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారం చిచ్చుపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నా.. మళ్లీ చలో రావులపాలెం పిలుపుతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. నిన్న జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకుని.. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని అన్ని నెట్‌వర్క్‌లను ఆదేశించారు పోలీసు అధికారులు.. ఇక, వివిధ ప్రాంతాల […]