కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ముఖ్యంగా అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అయితే, అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుండి భారీగా అమలాపురం చేరుకున్నారు పోలీసులు.. రాత్రి నుంచి అమలాపురంలో వర్షం కూడా కురుస్తుండడంతో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు.. […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, వైశాఖమాసం, కృష్ణపట్నం, బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=fBP__GFXZ_w
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి.. తాజాగా, పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే జోగారావుకు నిరసన సెగ తగిలింది.. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లమనాయుడువలసలో పర్యటనకు వెళ్లిన పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావుకు గ్రామస్తుల నుంచి నిరసన ఎదురైంది.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి రాకుండా వైసీపీలోని మరో వర్గం అడ్డుపడింది.. అసలు గ్రామంలోకి రానివ్వకుండా ఎమ్మెల్యే జోగారావును వైసీపీలోని సర్పంచ్ వర్గీయులు అడ్డుకోవడం చర్చగా మారింది.. […]
మహానాడు నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలుగుదేశం పార్టీ.. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు జరగనుంది.. అయితే, మహానాడు సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం జనసమీకరణ చేయడకుండా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకొని ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తున్నారని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే.. అయితే, మహానాడు తెలుగుజాతి పండుగ.. మహానాడుకు తరలివెళ్తాం.. అవసరమైతే నడిచి వస్తామని ప్రకటించారు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తోలు మందం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి.. డబ్బు ఇసుక, చెరువులో మట్టి అమ్ముకుని సంపాదించుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.. ఇక, ఆంధ్ర రాష్ట్రంలో బుద్ధిలేని రాష్ట్ర నాయకత్వం పరిపాలిస్తోందని విరుచుకుపడ్డ ఆయన.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర ఇటువంటివి ఆటలు చెల్లవని హెచ్చరించారు. అంతేకాదు, రాష్ట్రంలో […]
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. పొత్తులపై […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్… పోలవరం నిర్మాణం పూర్తి కాదని ఆయన స్పష్టం చేశారు.. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. భారీ ఎత్తున పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని నేను మానసికంగా సిద్ధపడ్డానని పేర్కొన్న ఆయన.. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను అన్నారు.. పోలవరాన్ని కట్టే […]
ఎవరి ప్రాణాలు ఎప్పుడు…? ఎలా? పోతాయో తెలియని పరిస్థితి.. కొందరు ప్రయాణాల్లో.. మరికొందరు నిద్రలోనే.. ఇంకా కొందరు నవ్వుతూ.. కొందరు ఏదో పనిలో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అయితే, ఓ వృద్ధుడికి శృంగారంపై మంచి ఆసక్తి ఉంది.. 60 ఏళ్లు దాటినా.. అతడిలో మాత్రం కోరికలు చావలేదు.. అదే ఇప్పుడు అతడి ప్రాణాలు తీసింది.. 40 ఏళ్ల మహిళతో ఓ హోటల్ గదిలో దిగిన 61 ఏళ్ల వృద్ధుడు.. ఆ కార్యం చేస్తూ.. […]
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్‌కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్‌లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో […]