తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దెబ్బకు మహిళలు హడలిపోతున్నారు అంటూ ధ్వజమెత్తారు వైసీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామల.. అంతేకాదు.. టీడీపీ నేతలు మొత్తం ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారు అంటూ సెటైర్లు వేశారు..
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసిన కాంగ్రెస్ కు.. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్‌లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఘాట్ రూట్లలో కూడా స్త్రీ శక్తి పథకం వర్తింపు చెయ్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గుర్తించారు.. సోమవారం ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు చేశారు.. జీరో ఫేర్ టికెట్ ద్వారా మహిళలకు రూ.7 కోట్లకు పైగా ఆదా అయినట్టు ఆర్టీసీ లెక్కలు చెబుతున్నాయి.. 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం చేసి.. రూ.19 కోట్ల లబ్ది పొందినట్టు…
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం రోజు తీర్పును వెలవరించింది ఏపీ హైకోర్టు.. అయితే, కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. వివిధ కోర్టుల్లో బెయిల్ దొరికింది.. దీంతో, 85రోజులుగా జైల్లో ఉన్న కాకాణి గోవర్దన్‌రెడ్డి ఈ రోజు జైలు నుంచి విడుదల కాబోతున్నారు..
విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు.
చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేసినా మిథున్ రెడ్డి…