Bus Accident in AP: తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా వరుసగా రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన.. చేవెళ్ల సమీపంలో ఈ రోజు ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 19 మంది మృతిచెందారు.. ఇక, రాజస్థాన్‌లోనూ ఓ ఘోర ప్రమాదం జరిగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఏలూరు జిల్లాలో భారతి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.. లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో ఉన్న మలుపు తిప్పే సమయంలో బస్సు బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో పైకెత్తి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒకరు మాత్రమే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.. అయితే, గాయపడిన 10 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు..
Read Also: Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ‘సిరా’ చరిత్ర తెలుసా..!