ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సవాల్.. ఒక్క సెంట్ భూమి అయినా చూపించండి..!
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు.. అనంత వెంకటరామిరెడ్డికి 450 ఎకరాల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అని నిలదీసిన ఆయన.. మీకు రాజకీయమే వ్యాపారంగా మారింది నిజం కాదా..? అని నిలదీశారు.. 70 ఏళ్ల వయస్సు వచ్చినా మీ వైఎస్ జగన్ రెడ్డి లాగా.. మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. నా పేరు మీద కానీ, మా బంధువుల పేరు మీద కానీ.. ఒక్క సెంట్ భూమి చూపించండి అని సవాల్ విసిరారు.. ఈ 16 నెలల్లో మేం ఎక్కడైనా భూమి కొనుగోలు చేశామేమో చూపించండి అంటూ ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఇక, మీకు వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు.. కానీ, కోట్ల ఆస్తులు ఎక్కడివి? అని అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. 20/1, 22/1, 50/2, 51/2, 26, 49/2, 35/2, 23/2b, 49/1 సర్వే నెంబర్ల గురించి మాట్లాడండి.. డీసీ ల్యాండ్స్ మీకు ఎలా వచ్చాయి.? అని నిలదీశారు.. మీ సోదరులు సుబ్బారెడ్డి, చంద్రారెడ్డిలు, మీ సోదరుడి భార్య మాలతి పేరు మీద, మీ పేరు మీద భూములు ఎక్కడివి…? అందుకే 40 ఏళ్ల చరిత్ర కలిగిన మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అంటూ అనంత వెంకటరామిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..
ఏపీకి రూ.2 వేల కోట్ల కేంద్రం నిధులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది.. సాస్కి.. (Special Assistance for Capital Investment) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.2వేల కోట్లు మంజూరు చేశారు.. ఈ నిధులను వినియోగించి గ్రామాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ ఉండదు అని స్పష్టం చేశారు.. రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు ప్రమాణాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిర్మాణం ప్రారంభమైన తర్వాత పలు దశల్లో క్వాలిటీ చెక్ తప్పనిసరి.. ప్రమాణాలకు విరుద్ధంగా పనులు జరిగినా, అవకతవకలు నమోదైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో అక్కడి పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో ప్రతి గ్రామానికీ పటిష్టమైన, బలమైన రహదారులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, భక్తులు ఇబ్బంది పడుతున్నారు.. శ్రీశైలం రాకపోకలు సాగించే భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది.. శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.. ఉదయం నుంచి శ్రీశైలంలో భారీ వర్షం కురుస్తోంది.. ఈ వర్షానికి శ్రీశైలం – హైదరాబాద్ ఘాట్‌రోడ్డులోని డ్డయమ్, స్విచ్ యార్డ్ సమీపంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద కొండ చరియలు, బండరాళ్లు, చెట్లు విరిగి రోడ్డుపై అడ్డుగా పడిపోయాయి.. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. అయితే, కొండచరియలు, బండరాళ్లు, చెట్లు విరిగినపడిన ప్రాంతంలో.. ఆ సమయంలో వాహనాలు ఏమి లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. కొండచరియలు విరిగినపడిన సమయంలో.. ఆ ప్రాంతంలో కారు, బస్సు, లారీలు ఏదైనా ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని.. ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని.. ఆ సమయంలో అక్కడ ఏ వాహనం, భక్తులు ఎవరూ లేకపోడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.. వర్షం కురిసే సమయంలో ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు..
మొంథా తుఫాన్ బాధిత రైతులకు జగన్ పరామర్శ.. కూటమి సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు..
మొంథా తుఫాన్ ఏపీలో విధ్వంసమే సృష్టించింది.. కృష్ణా జిల్లాలో తుఫాన్ బాధిత రైతులను కలిసిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పంట నష్టంపై ఆరా తీశారు.. ప్రభుత్వం నుంచి ఏ మేరకు సాయం అందిందని అడిగి తెలుసుకున్న ఆయన.. కూటమి సర్కార్‌పై ధ్వజమెత్తారు.. రాష్ట్రంలో రైతు పరిస్థితి తెలుసుకోవాలంటే గ్రౌండ్ లోకి తిరిగి చూస్తే అర్థం అవుతుంది.. ఈ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా, నిర్దయగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు.. గోదావరి జిల్లాల నుంచి కర్నూల్ వరకు తుఫాను ఎఫెక్ట్ ఉంది.. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా పంట పొలాలు మొత్తం నేట మునిగాయి.. తీవ్ర గాలులకు పంటలు దెబ్బతిన్నాయి.. రైతుల ఆరుగాలం కష్టం కోల్పోయారు.. పత్తి, మొక్కజొన్న, బత్తాయి పంటలు నాలుగు లక్షల ఎకరాల్లో మునిగాయి.. 18 నెలల చంద్రబాబు ప్రభుత్వంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు సంభవించాయి.. 18 నెలలుగా ఒక్క రైతుకైనా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇచ్చారా..? ఇన్సూరెన్స్ డబ్బులు, పెట్టుబడి సాయం అందిందా..? అనినిలదీశారు వైఎస్ జగన్.
అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగిన “జనం బాట” కార్యక్రమంలో భాగంగా జిల్లా సెంట్రల్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడిన ఆమె, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత మీడియాతో మాట్లాడుతూ, “నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారు. ఎన్నో వాగ్దానాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీలతో అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు” అని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామకాలను మాత్రమే కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు. “డీఎస్సీ, ఫార్మసీ, గ్రూప్స్ కోసం విద్యార్థులు కష్టపడుతున్నారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు. మొన్నటి గ్రూప్-1 పరీక్షల్లో అనేక తప్పులు జరిగాయని, తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కవిత ఆరోపించారు. “ఇలా కాకుండా క్వాలిటీ ఎగ్జామ్స్ నిర్వహించండి. ప్రతిపక్షాల సహకారం కూడా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలి” అని సూచించారు.
చేవెళ్ల బస్సు ప్రమాదం పై HRC సుమోటోగా కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, కమిషన్ గౌరవ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనలో రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అలాగే అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు మీడియాలో ప్రస్తావించబడిన నేపథ్యంలో కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రవాణా, హోం, గనులు & భూగర్భశాస్త్రం శాఖలు, ఎన్‌హెచ్‌ఏఐ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీజీ ఆర్టీసీ అధికారుల నుండి పూర్తి స్థాయి నివేదికలను డిసెంబర్ 15, 2025 ఉదయం 11 గంటలకు లోపు సమర్పించాలంటూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు..
పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్‌లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ భారీ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు నిర్ధారించాయని తెలిపింది.
హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా లండన్ ఆసుపత్రిలో మరణించారు. 85 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో జీపీగా పిలువబడే ఆయన 1950లో కుటుంబ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. కంపెనీని ఇండో-మిడిల్ ఈస్ట్ ట్రేడింగ్ ఆపరేషన్ నుంచి ఒక అంతర్జాతీయ కంపెనీగా మార్చారు. ఈయన నలుగురు హిందూజా సోదరుల్లో రెండోవారు. ఈయన అన్న శ్రీచంద్ హిందూజా 2023లో మరణించారు. మిగిలిన ఇద్దరు సోదరులు ప్రకాష్ హిందూజా, అశోక్ హిందూజా.
కార్లకు రెక్కలు రాబోతున్నాయి.. టెస్లాను బీట్ చేసిన చైనా కంపెనీ!
అమెరికా దిగ్గజం టెస్లా కంపెనీని ఒక చైనా కంపెనీ బీట్ చేసింది. టెస్లా త్వరలో తమ సొంతంగా ఎగిరే కార్లను ప్రారంభించాలని యోచిస్తున్న సమయంలో.. ఈ చైనా కంపెనీ ఆ దిశగా ఇప్పటికే ముందంజలో ఉంది. ఈ వారం ఆ చైనా కంపెనీ ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్లను కొత్త తరం రవాణాగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ టెస్లాను బీట్ చేసిన ఆ చైనా కంపెనీ ఏంటో తెలుసా చైనీస్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఎక్స్‌పెంగ్. ఈ కంపెనీ ఎగిరే కార్ల తయారీ విభాగం ఎక్స్‌పెంగ్ ఏరోహ్ట్ సోమవారం ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ ఫ్యాక్టరీలో ఎగిరే కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది.
హై-టెక్ ఫీచర్స్ తో.. మార్కెట్ లోకి కొత్త హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్.. ధర ఎంతంటే?
హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్‌లు, నిలువు క్వాడ్-బీమ్ LED హెడ్‌లైట్‌లతో దీర్ఘచతురస్రాకార గ్రిల్ ఉంది. C-ఆకారపు DRLలు, కనెక్ట్ చేసిన లైట్ బార్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు కూడా పైభాగంలో అందించారు. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, వెన్యూ బ్యాడ్జింగ్‌తో సి-పిల్లర్‌పై సిల్వర్ ఇన్సర్ట్ ఉన్నాయి. వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన టెయిల్‌లైట్ క్లస్టర్, 3D వెన్యూ లోగో, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
వరల్డ్ కప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ..
భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది. జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మలతో పాటు మిగతా క్రికెటర్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. వరల్డ్ కప్ విజయం తర్వాత కొంత మందికి ఫాలోవర్ల సంఖ్య డబుల్, త్రిపుల్ అయింది. దీంతో పాటే వారి ఫీజులు కూడా రెట్టింపు అయ్యాయి. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్ ప్రస్తుతం బ్రాండ్ హాట్ ఫెవరెట్‌గా మారింది. జెమియా బ్రాండ్‌ను నిర్వహించే JSW స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తమకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్‌లు వచ్చాయని, మేము 10-12 విభాగాలలోని బ్రాండ్లతో సంభాషణ జరుపుతున్నట్లు చెప్పారు. నివేదికల ప్రకారం, జెమియా ఇప్పుడు బ్రాండ్ల లాంగివిటీ, డెలివరీలను బట్టి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఫీజులు వసూలు చేస్తుంది.
తాళి వేసుకోవడం వివక్ష లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్
రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ అనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈయన. తాజాగా ఓ ఇంటర్యూలో తన భార్య తాళిబొట్టు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి ఆడవారి సమస్యలపై ఎప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటుంది. మీటూ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. ఇండస్ట్రీలో, సమాజంలో మహిళలపై జరిగే దాడులు, వివక్ష మీద ఆమె ఎవరికైనా ఎదురెళుతుంది. అప్పుడప్పుడు స్టార్ హీరోలు, డైరెక్టర్ల మీద కూడా సంచలన కామెంట్లు చేసిన విషయం మనం చూశాం. ఇక రాహుల్ కూడా కొంచెం అలాంటి దారిలోనే వెళ్తున్నట్టు ఉన్నాడు.
వాడు పశువుతో సమానం.. భరణితో ట్రోల్స్ పై స్పందించిన మాధురి..
బిగ్ బాస్ సీజన్-9లో ఈ వారం మాధురి ఎలిమినేట్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెపై ఎన్ని రకాల ట్రోల్స్ వచ్చాయో మనం చూశాం కదా. మరీ ముఖ్యంగా భరణితో మాధురికి లవ్ ట్రాక్ అంటూ నానా రకాల మీమ్స్, కథనాలు వచ్చాయి. వీరిద్దరూ దీపావళి సందర్భంగా చేసిన డ్యాన్స్ మీద అయితే చెప్పలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చి పడ్డాయి. ఇక మొన్నటి ఆదివారం నాడు అందరూ ఊహించినట్టే మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. రెండు వారాలకే బయటకు వచ్చేసింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అనేక అంశాలపై స్పందించింది. మరీ ముఖ్యంగా భరణితో డ్యాన్స్ చేయడంపై వచ్చిన ట్రోల్స్ గురించి రియాక్ట్ అయింది. అసలు నేను భరణి గురించే పట్టించుకోలేదు. హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి కేవలం నా ఆటమీదనే దృష్టి పెట్టాను. దీపావళి రోజు నాగార్జున గారు అడిగారు కాబట్టే భరణితో డ్యాన్స్ చేశాను. కానీ అతని చేయి కూడా నేను టచ్ చేయలేదు. అందులో ఎలాంటి అశ్లీలత లేదు. కేవలం ఫన్ కోసమే అలా చేశాను. అయినా సరే దాని మీద ట్రోల్స్ చేశారంటే.. వాడు మనిషి కాదు పశువుతో సమానం అంటూ ట్రోలర్స్ పై మండి పడింది. తాను ఎంతో పద్ధతిగా హౌస్ లో ఉన్నానని.. అందరితో న్యూట్రల్ గా ఉండటమే తనకు నచ్చతుందని తెలిపింది మాధురి.