అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ - ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు.. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ఈ రెండు అంతర్జాతీయ బ్యాంక్‌లు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.. ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. ఈరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో.. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు మర్రి రాజశేఖర్.
మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.
జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం చాలా ఆశలు పెట్టుకుంది. ఇవి కచ్చితంగా సామాన్యులు, మధ్యతరగతికి ఊరట ఇస్తాయనే నమ్మకంతో ఉంది. ఆర్థిక మంత్రి అయితే ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో గణాంకాలతో సహా చెబుతున్నారు. ఇప్పటికే జీఎస్టీ అవుట్ రీచ్ ప్రోగ్రాముల్లో మంచి స్పందన వచ్చిందనే భావనతో ఉన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది..
అమెరికాలో తెలంగాణ యువకుడు హత్యకు గురయ్యాడు.. పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు.. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.