Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించింది.. సాస్కి.. (Special Assistance for Capital Investment) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.2వేల కోట్లు మంజూరు చేశారు.. ఈ నిధులను వినియోగించి గ్రామాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ ఉండదు అని స్పష్టం చేశారు..
Read Also: World Cup: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ..
రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు ప్రమాణాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిర్మాణం ప్రారంభమైన తర్వాత పలు దశల్లో క్వాలిటీ చెక్ తప్పనిసరి.. ప్రమాణాలకు విరుద్ధంగా పనులు జరిగినా, అవకతవకలు నమోదైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో అక్కడి పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి రూ.35 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంతో ప్రతి గ్రామానికీ పటిష్టమైన, బలమైన రహదారులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..